Begin typing your search above and press return to search.
ఈ ఏడాది ప్రభాస్ మరో సర్ ప్రైజ్ ఇస్తారట
By: Tupaki Desk | 19 March 2022 6:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది మరో సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా వాయిదాపడుతూ వచ్చిన ఈ భారీ విజువల్ వండర్ ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ప్రారంభ వసూళ్ల పరంగా దేశ వ్యాప్తంగా సరికొత్త రికార్డులు నమోదు చేసింది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాన్ని రాబట్టలేకపోయిందని అభిమానులు వాపోతున్నారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం విజువల్ వండర్ గా వండర్స్ క్రియేట్ చేసినా కంటెంట్ పరంగా అభిమానులు ఆశించిన స్థాయిలో లేదని ఫీలవుతున్నారట. రిలీజ్ రోజే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి గురవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఫలితాన్ని తాము ఊహించలేదని, భారీ స్థాయిలో ఊహించుకున్నామని అటున్నారట. ఇదిలా వుంటే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ప్రభాస్ సడన్ గా స్పెయిన్ వెళ్లిపోయారు.
ప్రభాస్ ఓ మైనర్ సర్జరీ కోసం వెళ్లారని తెలిసింది. ఇటీవల `సలార్` షూటింగ్ లో ప్రభాస్ కు స్వల్పగాయమైనట్టుగా వార్తలు వినిపించాయి. అయితే దాని కారణంగా గత కొంత కాలంగా ప్రభాస్ తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారట. ప్రభాస్ గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు మైనర్ సర్జరీ అవసరమని చెప్పడంతో ఆయన అందు కోసం స్పెయిన్ కి వెళ్లినట్టుగా తెలిసింది. సర్జరీ అనంతరం ప్రభాస్ త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నారు.
ప్రభాస్ తాజాగా యంగ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదొక హారర్ కామెడీ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. రెండే రెండు షెడ్యూళ్లలో ఈ మూవీని కంప్లీట్ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట. అంత ఫాస్ట్ గా ఈ ఊవీని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తుండటానికి కారణం ఈ మూవీని ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట.
ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీస్ `సలార్` ఈ ఏడాది రావడం కష్టమే అంటున్నారు. ఇక `ఆది పురుష్` వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించేశారు. ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలు ఇప్పట్లో రావడం కష్టమన్నది అందరికి తెలిసిందే. ఇందులో `స్పిరిట్` ఇంకా ప్రారంభం కాలేదు. అందుకే మారుతి తో చేయబోతున్న హారర్ కామెడీని రెడు షెడ్యూళ్లలో ఫాస్ట్ గా ముగించేసి ఇదే ఏడాది రిలీజ్ చేసి అభిమానులతో పాటు ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.