Begin typing your search above and press return to search.

పుష్ప 2లో స‌మంత‌.. బిగ్ స్కెచ్ వేసిన‌ సుకుమార్‌!?

By:  Tupaki Desk   |   26 March 2022 3:24 AM GMT
పుష్ప 2లో స‌మంత‌.. బిగ్ స్కెచ్ వేసిన‌ సుకుమార్‌!?
X
ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ హ్యాట్రిక్ చిత్రం `పుష్ప`. ఇందులో ర‌ష్మిక హీరోయిన్ కాగా.. సునీల్‌, మల‌యాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విల‌న్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా వ‌స్తుంద‌ని మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. అలాగే ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైజ్‌` పేరుతో గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కూడా చేశారు.

మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న‌ప్ప‌టికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు, బ‌య‌ర్ల‌కు లాభాల‌ను అందించింది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో బ‌న్నీ మాస్ లుక్‌, బాడీ ల్యాంగ్వేజ్‌, మ్యాన‌రిజ‌మ్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా అల‌రించాయి. దేవీ శ్రీ ప్రసాద్ స్వ‌ర‌ప‌రిచిన పాట‌లు కూడా ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా స‌మంత చేసిన `ఊ అంట‌వా మావ‌.. ఊఊ అంట‌వా..` సాంగ్ ఎన్ని రికార్డుల‌ను కొల్ల‌గొట్టిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక‌పోతే ప్ర‌స్తుతం సుకుమార్ సెకెండ్ పార్ట్‌ అయిన `పుష్ప ది రూల్‌` పైనే ఫోక‌స్ పెట్టాడు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కాబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకునే విధంగా అన్ని హంగుల‌ను జోడించి భారీగా పార్ట్ 2ను రూపొందించ‌బోతున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

అదేంటంటే.. పుష్ప పార్ట్ 1లో ఐటెం సాంగ్ చేసిన స‌మంత‌.. పార్ట్ 2లో కూడా మెర‌వ‌బోతోంద‌ట‌. కానీ, ఆమె ఇందులో చేసేది ఐటెం సాంగ్ కాద‌ని అంటున్నారు. వాస్త‌వానికి సమంత సుకుమార్‌కు లక్కీ హీరోయిన్‌గా మారింది. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ `రంగస్థలం`లో సామ్‌ హీరోయిన్‌గా చేయ‌గా.. ఆ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. పుష్ప తొలి భాగంలో ఆమె ఐటెం భామ‌గా క‌నిపించ‌గా.. ఆ మూవీ సైతం ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పింది.

ఈ నేప‌థ్యంలోనే సామ్ కోసం సుకుమార్ బిగ్ స్కెచ్ వేశాడ‌ట‌. `పుష్ప ది రూల్‌`లో రెండు నిమిషాలు ఉండే ఓ గెస్ట్ రోల్‌ను క్రియేట్ చేశాడ‌ట‌. ఆ గెస్ట్ రోల్‌ను స‌మంత చేత చేయించ‌నున్నార‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.