Begin typing your search above and press return to search.

'థాంక్యూ' తర్వాత కథ మొదలు..!

By:  Tupaki Desk   |   20 July 2022 1:30 AM GMT
థాంక్యూ తర్వాత కథ మొదలు..!
X
హీరోయిన్ గా ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈ అమ్మడు అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో అందరం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు కొనసాగేందుకు ఆమె పడ్డ కష్టం.. పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. బాడీ షేమింగ్ చేయడంతో సన్నగా నాజూకుగా తయారు అయ్యింది.

డాన్స్ ల విషయంలో విమర్శలు రావడంతో కఠినంగా ప్రాక్టీస్ చేసింది. ఇతర విషయాల పట్ల కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది.. కథల ఎంపిక విషయం మొదలుకుని స్కిన్ షో వరకు జనాలు ఏదైతే కోరుకున్నారో.. కోరుకుంటున్నారో అదే ఇవ్వాలి.. చేయాలని భావించింది. అయినా కూడా రాశి ఖన్నా కు అదృష్టం కలిసి రాలేదు.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత పీక్స్ లో ఉంటుంది. అయినా కూడా సినిమాల్లో ఈమెకు వస్తున్న ఆఫర్లు తక్కువే. ఇటీవల ఈమె చేసిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది. ఇక త్వరలో థాంక్యూ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా లో నాగ చైతన్య తో ముగ్గురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్‌ గా.. కాస్త మెయిన్‌ లీడ్ గా కనిపించబోతుంది.

థాంక్యూ సినిమా సక్సెస్ అయితే రాశి ఖన్నా కు పెద్దగా కష్టపడకుండానే ఆఫర్లు అయితే వస్తాయి. ఒకటి రెండు సినిమా ల్లో వెంటనే అవకాశం రావడం జరుగుతుంది. కానీ ఫలితం తేడా కొడితేనే అసలు కథ మొదలవుతుంది. ఆఫర్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాలి. తమిళంలో అడపా దడపా వస్తున్నప్పటికి తెలుగు లో ఆఫర్లు రాబట్టుకునేందుకు సోషల్‌ మీడియా లో హడావుడి చేస్తూ ఉండాలి.

ప్రస్తుత గ్లామర్ డోస్ ను పెంచాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇండస్ట్రీ లో రెగ్యులర్ గా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీడియా లో ఉండాలి. అప్పుడే సినిమాల్లో ఆఫర్లు వస్తాయి. అక్కడి వరకు రాశి ఖన్నా పరిస్థితి వెళ్లక పోవచ్చు అనేది కొందరి అభిప్రాయం. హీరోయిన్ గా థాంక్యూ సినిమా తో రాశి కి పూర్వ వైభవం.. మంచి ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ తన సినిమా ల్లో హీరోయిన్ పాత్రలకు చాలా ప్రాముఖ్యతను కల్పిస్తాడు. కనుక ఈ సినిమా తర్వాత రాశి కి ఫలితం తో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తాయి అనే వారు కూడా లేకపోలేదు. మరి రాశి కెరీర్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంటుంది అనేది త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.