Begin typing your search above and press return to search.

హిందీ బెల్ట్ లోనూ `రాధేశ్యామ్`కి ప‌న‌వ్వ‌లేదు!

By:  Tupaki Desk   |   16 March 2022 1:30 AM GMT
హిందీ బెల్ట్ లోనూ `రాధేశ్యామ్`కి ప‌న‌వ్వ‌లేదు!
X
డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` ఇటీవ‌ల విడుద‌లై డివైడ్ టాక్ తో ర‌న్నింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నా ల‌మ‌ద్య అత్య‌ధిక స్కీన్ల‌లో రిలీజ్ అయిన సినిమా తొలిరోజు మంచి ఒపెనింగ్స్ సాధించింది. ప్ర‌భాస్ పాన్ ఇండియా ఇమేజ్ తో అన్నిచోట్ల ఓపెనింగ్స్ బాగానే ద‌క్కాయి. కానీ ఆ త‌ర్వాత అన్ని చోట్లా సినిమా ఒక్క‌సారిగా డీలా ప‌డిపోయింది. కేవ‌లం విజువ‌ల్ ట్రీట్ గానే హైలైట్ అవ్వ‌డం..క‌మ‌ర్శియ‌ల్ అంశాలు సినిమాలో లేక‌పోవ‌డం స‌హా డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీకి ప్రేక్ష‌కులు క‌నెక్ట్ కాలేక‌పోయారు.

పిరియాడిక్ ల‌వ్ స్టోరిని హైలైట్ చేయాల‌ని..స‌రికొత్త ప్రేమ‌క‌థ‌ని ఆవిష్క‌రిస్తున్నామ‌ని ఫీలైన మేక‌ర్స్ ఆలోచ‌న‌లు త‌ల్ల‌కిందుల‌య్యాయి. చివ‌రికి ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ నెగిటివ్ టాక్ పై అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసారు. `సాహో` టైపులో హిందీ బెల్డులోనైనా మంచి వసూళ్లు సాధింస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నా అక్క‌డా ప‌న‌వ్వ‌డం లేదని తాజా లెక్కల్ని బ‌ట్టి తెలిసిపోతుంది. మొద‌టి రెండు రోజులు వ‌సూళ్ల ప‌ర్వంగా ప‌ర్వాలేద‌నిపించినా సోమ‌వారం వ‌సూళ్లు దారుణంగా ప‌డిపోయాయి. సోమ‌వారం నాడు కేవ‌లం1.2 కోట్లు మాత్ర‌మే తేగ‌లిగింది.

ఇది ప్ర‌భాస్ పాన్ ఇండియా రేంజ్ కి...అందులోనూ హిందీ మార్కెట్ కి ఏమాత్రం పొంత‌న లేని వ‌సూళ్లుగా చెప్పొచ్చు. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న `సాహో` సైతం హిందీ బెల్టులో బాగానే వ‌సూళ్లును సాధించింది. కానీ `రాధేశ్యామ్` అంత‌కు దారుణంగా ప‌డిపోయింది. ఇక తెలుగు రాష్ర్టాల్లోన అదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది.

మొద‌టి వారంతంలోనే కలెక్ష‌న్లు దారుణంగా ప‌డిపోయాయి. అయితే ఈ సినిమాకి బ‌జ్ తీసుకురావడంలో యూనిట్ మొద‌టి నుంచే వెనుక‌బ‌డే ఉంది. కంటెంట్ ఎలా ఉన్నా రిలీజ్ కి ముందు అగ్ర హీరోల సినిమాల ప్ర‌చారం మార్మోగిపోతుంది. సినిమాలో విష‌యం ఉన్నా లేక‌పోయినా కావాల్సినంత బ‌జ్ తీసుకొస్తారు.

ఇటీవ‌ల రిలీజ్ అయిన `ఖిలాడీ` ఏ రేంజ్ లో ప్ర‌మోట్ అయిందో...ఏ స్థాయి బ‌జ్ క్రియేట్ అయిందో తెలిసిందే. రిజ‌ల్ట్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే బ‌జ్ తీసుకురావ‌డంలో మేకర్స్ స‌క్సెస్ అయ్యారు. కానీ `రాధేశ్యామ్` విష‌యంలో మొద‌టి నుంచి క్లారిటీ లోపించింద‌నే చెప్పాలి. ఓసారి యాక్ష‌న్ ల‌వ్ స్టోరీ అన్నారు. మ‌రోసారి ప్యూర్ ల‌వ్ స్టోరీ అన్నారు. దీంతో ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత రెండొదాన్నే చాలా మంది క‌న్ఫ‌మ్ చేసుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే సినిమా ఫ‌లితం కనిపిస్తుంది.