Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' రిలీజ్ విషయంలో నిజమైన జోస్యం!
By: Tupaki Desk | 14 March 2022 4:30 AM GMTమొదటి నుంచి కూడా ప్రభాస్ యాక్షన్ తో కూడిన లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చాడు. కానీ మొదటిసారిగా ఆయన అసలు ఫైట్ అనేది లేని పూర్తి స్థాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రాధేశ్యామ్' చేశాడు. ఒక రకంగా ఇది సాహసంతో కూడిన ప్రయోగమేనని చెప్పుకోవాలి. అలా ఈ సినిమాతో రాధాకృష్ణ కుమార్ ప్రేక్షకులకు కొత్త ప్రభాస్ ను పరిచయం చేశాడు. భారీ నిర్మాణ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ తరువాత కూడా రాధా కృష్ణ కుమార్ ఇంటర్వ్యూలతో బిజీగానే ఉన్నాడు.
తాజా ఇంటర్వ్యూలో 'ఈ సినిమాలో జాతకాలను గురించిన పాయింట్ ను టచ్ చేశారు కదా? మీరు జాతకాలను నమ్ముతారా? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "జాతకాల విషయానికి వస్తే వందశాతం నమ్మకానికి అవసరమైన కారణాలు నాకు కనిపించలేదు. అలా అని చెప్పేసి నమ్మకూడదని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. ఈ సినిమా కోసం నేను జాతకాలు చెప్పేవారిని కొన్ని వందలమందిని కలుసుకున్నాను. ఈ శాస్త్రాన్ని గురించిన సందేహాలను అడిగి తెలుసుకున్నాను. నాడీ జోస్యం చెప్పే ఒక వ్యక్తి శాస్త్రంపై అవగాహన లేకుండా చెప్పడం చూశాను.
బయట జాతకాలు చెప్పే కొంతమందికి శాస్త్రంలో అనుభవం .. దానిపై అవగాహన లేకపోడం గమనించాను. ఫేస్ రీడింగ్ ను .. సైకాలజీని ఒక శాస్త్రంలా చెప్పేవారు కూడా చాలామందినే ఉన్నారు. కొంతమంది మాత్రం చాలా కరెక్ట్ గా చెప్పడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు హైదరాబాద్ లో జాతకాలు చెప్పే ఒక ఫేమస్ పర్సన్ ను కలిశాను. ఈ సినిమా నాలుగేళ్ల తరువాత రిలీజ్ అవుతుందని ఆయన అప్పుడే చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను .. నేను చేసే సినిమా రిలీజ్ కావడానికి అంత సమయం ఎందుకు పండుతుంది? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? అనుకున్నాను.
అప్పటికి కరోనా ఊసే లేదు .. అయినా ఆయన నాలుగేళ్ల తరువాత ప్రథమార్థంలో ఈ సినిమా విడుదలవుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. అలాగే ఈ సినిమాలో కృష్ణరాజు పాత్రకు ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆ జ్యోతిష్కుడు కూడా బాగా వయసు పైబడిన ఆయనే .. హైదరాబాద్ లో సెటిలైన ఆయనే.
ఒకసారి ఆయనను నేను కలిసినప్పుడు నా డ్రీమ్ ఏంటీ? ఎప్పుడు హైదరాబాద్ వచ్చాను? మొదటిసారి నా చేతికి వచ్చిన 'చెక్' పై డేట్ ను కూడా ఆయన చెప్పారు. 'జిల్' సినిమా కోసం నేను అడ్వాన్స్ గా అందుకున్న 'చెక్' డేట్ ఆయన అంత కరెక్ట్ గా చెప్పడంతో, అదెలా సాధ్యమనేది అర్థంకాక నేను షాక్ అయ్యాను" అని చెప్పుకొచ్చాడు.