Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: రామ్-భీమ్ పాత్ర‌లు వేరైనా రేంజ్ ఒక్క‌టే

By:  Tupaki Desk   |   15 March 2022 12:30 PM GMT
ఫోటోస్టోరీ: రామ్-భీమ్ పాత్ర‌లు వేరైనా రేంజ్ ఒక్క‌టే
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ళ్లీ పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` ప్ర‌మోష‌న్లో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ కి ఇంకా ప‌ది రోజులే స‌మ‌యం ఉండ‌టంతో రామ్-భీమ్ లు రంగంలోకి దిగిపోయారు. జంట‌గా క‌లిసి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. తాజాగా చ‌ర‌ణ్‌-తార‌క్ ఇద్ద‌రు ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. సినిమాలో ఇద్ద‌రి పాత్ర‌లు పోటా పోటీగా సాగుతాయ‌న్న‌ది తెలిసిందే. రెండు పాత్ర‌లు స‌మానం.

సినిమా ప్రారంభం దగ్గ‌ర నుంచి శుభం కార్డు ప‌డే వ‌ర‌కూ రామ్-భీమ్ పోరాటం ఆద్యంతం ఆక‌ట్టుకోనుంది. ఇలా సినిమాలో ఇద్ద‌రు ఎలా స‌మానమో! బ‌య‌ట ఇద్ద‌రి క్రేజ్ కూడా అంతే స‌మానం.

తెలుగు లో ఇద్ద‌రు బిగ్ స్టార్స్. కోట్లాది మంది అభిమానుల్ని క‌లిగి ఉన్నారు. పారితోషికం స‌హా ఇత‌ర విష‌యాల్లోనూ స‌మాన రేంజ్ క‌ల్గి ఉన్న‌వారే. తాజాగా `ఆర్ ఆర్ ఆర్` ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతున్న నేప‌థ్యంలో ఆ రేంజ్ విష‌యంలోనూ ఇద్ద‌రు ఇద్ద‌రే అనిపిస్తున్నారు. ఇక్కడ ఇద్ద‌రు జంట‌గా ప్ర‌చార కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్న సంద‌ర్భంగా తీసిన ఫోటో ఒక‌టి క‌నిపిస్తుంది. ఆ ఫోటోలో ఇద్ద‌రు రంగులు వేరైనా ఒకే డిజైన్ తో కూడిన కాల‌ర్ లెస్ ష‌ర్స్ట్ ధ‌రించారు.

ఒకే ర‌కం బ్రాండెడ్క షూస్ వేసుకున్నారు. బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు సేమ్. ఒక‌రు ఫెరారీ లోంచి దిగితే..మ‌రోక‌రు లంబోర్గీ నుంచి దిగారు. ఇలా ఇద్ద‌రు `ఆర్ ఆర్ ఆర్` విష‌యంలో స‌మానమైన రేంజ్ ని చూపిస్తున్నారు. ఇద్దరిలో ఒకే ర‌క‌మైన‌ మెయింట‌నెన్స్ క‌నిపిస్తుంది. కాబ‌ట్టి ఇద్ద‌రి డిజైన‌ర్ కూడా ఒక్క‌రే అన్న సందేహం రాక మాన‌దు. ఇలా ప్ర‌మోష‌న్ విష‌యంలోనే ఇద్ద‌రికి ఒకే రక‌మైన ప్రాధాన్య‌త క‌నిపిస్తుంది. ఇదంతా జ‌క్క‌న్న ప్లానింగ్ అయి ఉండొచ్చు.

రాజ‌మౌళితో సినిమా క‌మిట్ అయితే పూర్త‌య్యే వ‌ర‌కూ అత‌నితోనే ఉండాలి. మ‌ధ్య‌లో మ‌రో సినిమా చేయ‌డానికి వీలు ఉండ‌దు. రిలీజ్ అయ్యే వ‌ర‌కూ అన్ని ర‌కాల బాధ్య‌త‌లు జ‌క్క‌న్న తీసుకుంటారు. ఆ లెక్క‌న ఇక్క‌డ చ‌ర‌ణ్‌-తార‌క్ బాద్య‌త‌లు..చోటు చేసుకుంటోన్న స‌న్నివేశాల వెనుక కార‌కుడు జ‌క్క‌న్నే కావొచ్చు.

హీరోల ప్ర‌మోష‌న్ విష‌యంలోనే ఇంత ప్లానింగ్ గా ముందుకు వెళ్తోన్న జ‌క్క‌న్న పాత్ర‌ల మ‌ధ్య తేడాలు లేకుండా ఇంకెంత ప్లానింగ్ తో వ్య‌వ‌హ‌రిస్తారు? అన్న సందేహం రాక మాన‌దు. మ‌రి సోష‌ల్ మీడియాలో న‌లుగుతోన్న‌ పాత్ర‌ల మ‌ధ్య వ్య‌త్యాసం ఉంటుందా? ఉండ‌దా? అన్న‌ది సినిమా రిలీజ్ అయితే గాని క్లారిటీ రాదు.