Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ కోసం విజ‌య్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌

By:  Tupaki Desk   |   17 March 2022 7:33 AM GMT
చ‌ర‌ణ్ కోసం విజ‌య్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌` ఎట్ట‌కేల‌కు మార్చి 25న విడుద‌ల‌వుతోంది. గ‌త కొంత కాలంగా వివిధ కార‌ణాల వ‌ల్ల వాయిదాప‌డుతూ వ‌స్తున్న ఈమూవీ ఫైన‌ల్ గా రిలీజ్ అవుతుండ‌టంతో హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ల‌పై దృష్టిపెట్టారు. దాదాపు మూడేళ్ల పాటు విలువైన స‌మ‌యాన్ని `ఆర్ ఆర్ ఆర్‌` కోసం కేటాయించిన రామ్ చ‌ర‌ణ్ ఎట్ట‌కేల‌కు త‌న త‌దుప‌రి చిత్రాల‌ని వ‌రుస‌గా లైన్ లో పెట్టేస్తున్నారు. ఇప్ప‌టికే `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత శంక‌ర్ డైరెక్ష‌న్ లో భారీ చిత్రాన్ని ప్రారంభించేశారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్త‌యింది. అక్క‌డే చ‌ర‌ణ్ పాల్గొన‌గా కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించారు. ఇందులో చ‌ర‌ణ్ రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పిరియాడిక్ స్టోరీగా పాస్ట్ అండ్ ప్ర‌జెంట్ నేప‌థ్యంలో సాగే పొలిటికల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు.

చ‌ర‌ణ్ పై చిత్రీక‌రించే పోరాట ఘ‌ట్టాలు చిత్రానికి ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు రామ్ చ‌ర‌ణ్ మ‌రో చిత్రాన్ని కూడా బ్యాక్ టు బ్యాక్ ప‌ట్టాలెక‌క్కించ‌బోతున్నారు. `జెర్సీ` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్ లో చ‌ర‌ణ్ ఓ భారీ మూవీకి ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన విష‌యం తెలిసిందే. యువీ క్రియేష‌న్స్, ఎన్ వి ఆర్ సినిమా సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించ‌బోతున్నారు. ఇప్ప‌టికే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ని మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీని జూన్ లో లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నార‌ట‌. RC16 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొంద‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. యాక్ష‌న్ ఒరియెంటెడ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి త‌మిళ యంగ్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీతం అందించ‌బోతున్న‌ట్టుగా తెలిసింది. ప్ర‌స్తుతం అనిరుధ్ త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన `బీస్ట్‌` చిత్రానికి సంగీతం అందించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన లిరిక‌ల్ వీడియోలు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ తాజాగా రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ఫైన‌ల్ కావ‌డం ఈ మూవీకి మ‌రింత ప్ల‌స్ అవుతుంద‌ని చ‌ర‌ణ్ ఫ్యాన్స్ భావిస్తున్నార‌ట‌. భారీ బ‌డ్జెట్ తో స‌రికొత్త కథ‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ కు జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌బోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంద‌ని తెలిసింది. గౌత‌మ్ తిన్న‌నూరి ప్ర‌స్తుతం బాలీవుడ్ లో షాహీద్ క‌పూర్ తో `జెర్సీ` రీమేక్ ని పూర్తి చేశాడు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.