Begin typing your search above and press return to search.
సమ్మర్ లోనే రణబీర్-అలియా పెళ్లి భాజాలు
By: Tupaki Desk | 26 March 2022 8:30 AM GMTబాలీవుడ్ జంట రణబీర్ కపూర్-అలియా భట్ చాలా కాలంగా ప్రేమించుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లిపై మీడియాలో రకరకాల డిబేట్లు నడిచాయి. ప్రేమించుకున్న వారంతా ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటున్నారుగానీ..ఈ జంటకి మాత్రం ఇంకా టైమ్ రాలేదా? అంటూ సెటైర్లు వేసే స్థాయికి వ్యవహరం చేరుకుంది. దీంతో విసుగిపోయిన అలియాభట్ సైతం ఇద్దరికి ఎప్పుడో పెళ్లి అయిపోయిందని..అది మనసులో జరిగిపోయిందని ఓపెన్ అయింది.
అలియాభట్ ఇలా అనడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. ఇందులో రణబీర్ కపూర్ నాంన్చుడు సంగతి కూడా ఓ కారణంగా హైలైట్ అయింది. ఇవన్నీ చూసిన మీడియా జనం ఇద్దరు పెళ్లి చేసుకోవడం నిజంగా జరుగుతుందా? లేక కొందరిలో మధ్యలోనే బంధానికి బ్రేకప్ చెబుతారా? అని సైతం మీడియా కథనాలు హీటెక్కించాయి.
ఆ సంగతి పక్కన బెడితే తాజాగా రణబీర్ కపూర్ తల్లి నీతూకపూర్ వ్యవహారం చూస్తుంటే ఇద్దరి పెళ్లికి ముహూర్తం సెట్ చేసినట్లు కనిపిస్తుందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇటీవలే నీతుకపూర్ పెళ్లి బట్టలు సహా వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయమని ఫేమస్ డిజైన్ మనీష్ మల్హోత్రాని కలిసారుట. పెళ్లి బట్టల దగ్గర నుంచి అన్ని ఈవెంట్లకు సంబంధించి డిజైనర్ దుస్తులన్నీ అదిరిపోయేలా ఉండాలని ఆర్డర్ ఇచ్చారుట.
దీంతో ఈ వేసవిలో రణబీర్-అలియా జంట వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారంటూ మీడియాలో ఒక్కసారిగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంత వరకూ ఈ విషయంలో మౌనం దాల్చిన నీతు కపూర్ ఎట్టకేలకు పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిందని అంటున్నారు. రీషీ కపూర్ కోరిక మేరకు ఊరంత పందిరేసి..బంతి భోజునాలు ఏర్పాటు చేసి ఘనంగా పెళ్లి చేయాలని తుది నిర్ణయం తీసేసుకున్నట్లు తెలుస్తోంది.
అదే నిజమైతే అంతా హ్యాపీ. ఇప్పటివరకూ పెళ్లి విషయంలో రణబీర్ కపూర్ కుటుంబ సభ్యుల నుంచి సరైన స్పష్టత రాలేదని మీడియాలో ప్రచారం సాగేది. ఇప్పడు ప్రచారానికి తాత్కాలికంగా పుల్ స్టాప్ పడినట్లే. ఇటీవలే అలియాభట్ `గంగూబాయి కతియావాడి`తో భారీ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.