Begin typing your search above and press return to search.
వీడియో టాక్: కుప్పిగంతుల మాటున రష్మిక కఠోర శ్రమ!
By: Tupaki Desk | 29 March 2022 1:30 PM GMTఫిట్ నెస్ నేటితరం నాయికలకు తప్పనిసరి. అందుకే నిరంతరం ఫిట్ నెస్ గోల్స్ ని ఫిక్స్ చేసుకుని జిమ్ముల్లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. యోగా-ధ్యానం వంటివి కంపల్సరీ అయ్యాయి. ఇక టాలీవుడ్ నాయికల్లో ఫిట్ నెస్ అనగానే సమంత- రకుల్ ప్రీత్ వంటి స్టార్ హీరోయిన్లు గుర్తుకొస్తారు. ఆ ఇద్దరు ఫిట్ నెస్ ఫ్రీక్స్ గా పాపులర్. నిరంతరం ఈ భామలు ఫిట్ నెస్ ను కాపాడుకోవడానికి జిమ్ములో వర్కవుట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా రోజులో కొంత సమయం జిమ్ కి కేటాయిస్తున్నారు. రూపలావణ్యం చెక్కు చెదరకుండా జాగ్రత్తపడుతున్నారు.
ఈ లిస్ట్ లో రష్మిక మందన్న పేరు కూడా చేరుతోంది. సీనియర్ల బాటలోనే రష్మిక మందన పయనిస్తోంది. `గీతగోవిందం`- `సరిలేరు నీకెవ్వరు`..`పుష్ప ది రైజ్` చిత్రాలతో రష్మిక రేంజు మారిపోయింది. ప్రస్తుతం పారితోషికంలోనూ చుక్కలు చూపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే ఉత్సాహంలో ఫిట్ నెస్ గోల్స్ ని ఫిక్స్ చేసుకుని రూపురేఖల్ని మరింత ట్రిమ్ చేసేస్తోంది.
రష్మిక తాజా కసరత్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే. రొటీన్కి భిన్నంగా కొత్తగా ట్రై చేసినట్లు తెలుస్తోంది. జిమ్ములో కిందా.మీదా పడి అన్ని రకాలుగా బాడీలో ప్రతీ పార్ట్ కదిలేలా ఓళ్లు హూనం చేసే ఎక్సరసైజ్ లతో మతి చెడగొడుతోంది. కాళ్లు..చేతులు..పొట్ట అన్నింటిని సమపాళ్లలో ఒకేసారి కుదిపేస్తోంది. రష్మిక ముఖంలో ఎక్స్ ప్రెషన్ స్టడీ చేయగల్గితే ఆమె కష్టం కనబడుతుంది.
ట్రైయినర్ సమక్షంలో ఏమాత్రం రాజీకి రాకుండా సెకన్ల పాటు ఊపిరి ఆపి మరీ శ్రమిస్తుంది. ఆ కసరత్తులకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్ స్టాలో వైరల్ గా మారింది. చూడటానికి సిల్లీ ఎక్సర్ సైజుల్లా,,కుప్పిగంతుల్లా కనిపిస్తున్నా వాటి వెనుక చాలా కఠోర శ్రమ దాగి ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి.
టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి కేవలం మూడు నాలుగేళ్ల కే స్టార్ స్టాటస్ అందుకుంది. ఇప్పుడు పాపులారిటీ పెరిగిన నేపథ్యంలో ఆ ఇమేజ్ ని కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇలా ఫిట్ నెస్ పైనే ప్రత్యేకంగా శ్రద్ద పెట్టిందిట. జిమ్ములో నిరంతరం స్వేదం చిందిస్తూ సమంత.. రకుల్ కి తక్కువేం కాదని ప్రూవ్ చేస్తోంది.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ``పుష్ప దిరూ`ల్ లో నటిస్తోంది. బాలీవుడ్ లో `మిషన్ మజ్ను`.. `గుడ్ బై` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సందీప్ రెడ్డి వంగ కొత్త ప్రాజెక్ట్ `యానిమల్` లోనూ అవకాశం అందుకుంది. ఇందులో రాక్ స్టార్ రణబీర్ కపూర్ సరసన నటిస్తుంది. ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు లైనప్ లో ఉన్నట్లు సమాచారం.