Begin typing your search above and press return to search.
పవన్ ఎందుకు పవర్ఫులో వర్మకు ఇప్పడు అర్థమైందట
By: Tupaki Desk | 24 Feb 2022 6:18 AM GMTనిత్యం పవన్ కల్యాణ్ ని విమర్శిస్తూ ఆయనని పొగుడుతున్నట్టే పొగుడుతూ సెటైర్లు వేసే వర్మకు వున్నట్టుండి జ్ఞానోదయం అయిందా అన్నట్టుగా ఆయన పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సమయం చిక్కితే చాలా పవన్ కల్యాణ్ పై వ్యంగ్య బాణాలు సంధించే వర్మ ఉన్నట్టుండీ ఆయనని పొగుడుతూ ట్వీట్ చేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళితే... మెగా ఫ్యామిలీ హీరోల్లో మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లని సమయం చిక్కినప్పుడల్లా టార్గెట్ చేస్తూ తన పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు రామ్ గోపాల్ వర్మ. గతంలో శ్రీరెడ్డిని ముందుంచి పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయించి సంచలనం సృష్టించారు వర్మ.
ఇది అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది కూడా. ఏకంగా అల్లు అరవింద్ రంగంలోకి దిగి వర్మని లైవ్ లోనే చెడుగుడు ఆడుకున్నారు. మరో సారి మా ఫ్యామిలీ జోలికి వస్తే పరిస్థితి దారుణంగా వుంటుందని పరుశ పదజాలంతో అల్లు అరవింద్ మీడియా ముఖంగానే వర్మకు వార్నింగ్ ఇచ్చారు. అంతటితో వివాదం ముగిసిపోయిందని, అల్లు వారి వార్నింగ్ తో వర్మ మరోసారి మెగా కాంపౌండ్ హీరోల జోలికి రాడని అంతా అనుకున్నారు. కానీ వర్మ బుద్ధి మారదుగా మళ్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప ది రైజ్` రిలీజ్ సమయంలో వర్మ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బన్నీని పొగుడుతూ ట్వీట్ లు చేశారు.
బన్నీని చూసి నేర్చుకోవాలని ఈ పాత్రని ఇంత బాగా పవర్ స్టార్, మెగాస్టార్ చేయలేరని.. భవిష్యత్తులో బన్నీ బంధువులమని మాత్రమే మెగా ఫ్యామిలీ చెప్పుకోవాల్సి వస్తుందని సెటైర్లు వేశారు. అంతటితో ఆగక మరోసారి పవన్ కల్యాణ్ పై పడ్డారు. `సర్దార్ గబ్బర్ సింగ్` చిత్రాన్ని అనవసరంగా హిందీలో రిలీజ్ చేశారని, తాను వద్దని వారించినా తన మాట వినలేదని, అయితే ఇప్పడు `భీమ్లా నాయక్`ని హిందీలో రిలీజ్ చేయాలని సెటైర్లు వేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల భీమ్లా నాయక్` ట్రైలర్ రిలీజ్ సందర్భంగా కూడా వర్మ వివాదాస్పద ట్వీట్ లు చేయడంతో ఫ్యాన్స్ ఆయనపై అసహనాన్ని వ్యక్తం చేశారు.
ట్రైలర్ లో పవన్ - రానా ఒకరిని మించి ఒకరు పోటా పోటీగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరి పాత్రలు సమానంగా వున్నట్టుగా కనిపించింది. అయితే వర్మ మాత్రం ట్రైలర్ చూసి ఫ్యాన్ గా హర్ట్ అయ్యానని, ఈ చిత్రానికి భీమ్ల నాయక్ అని కాకుండా `డేనియల్ శేఖర్` అని పెట్టి వుంటే బాగుండేదనడం పవన్ అభిమానుల్ని మరింత ఉడికించింది. టైటిల్ `భీమ్లా నాయక్` అని వుంటే `డేనియల్ శేఖర్` అని పెట్టాల్సిందని అంటాడేంటీ? అని పవన్ ఫ్యాన్స్ వర్మపై చిందులు తొక్కారు.
ఇదిలా వుంటే తాజాగా వర్మ పెట్టిన ట్వీట్ పవన్ ఫ్యాన్స్ ని షాక్ కు గురిచేస్తోంది. ఎప్పుడూ పవన్ పై సెటైర్లు వేసే వర్మ ఇప్పుడేంటీ పొగిడేస్తున్నాడంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. `ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎక్సాట్రార్డినరీగా డిగ్నిఫైడ్ గా కనిపించారని, అతని నడవడిక టాలీవుడ్ లో వున్న స్టార్స్ అందరిలో అత్యంత శక్తి మంతుడని ఎందుకు అంటారనేది, పవన్ ఇక్కడున్న స్టార్ లలో పవర్ ఫుల్ స్టార్ అన్నది ఇప్పుడు అర్థమైందన్నట్టుగా వర్మ ట్వీట్ చేయడం పలువురిని ఆకట్టుకుంటోంది.