Begin typing your search above and press return to search.

కేవ‌లం ఉత్త‌ర అమెరికాలో 100కోట్లు?

By:  Tupaki Desk   |   30 March 2022 3:50 AM GMT
కేవ‌లం ఉత్త‌ర అమెరికాలో 100కోట్లు?
X
మోస్ట్ అవైటెడ్ RRR దేశ‌విదేశాల్లో సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తోంది. ఈ సినిమా ఇంటా బ‌య‌టా అద్భుత క‌లెక్ష‌న్ల‌తో రికార్డులు బ్రేక్ చేస్తోంది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కొన్ని పాత రికార్డులు ప‌దిలంగా ఉన్నా ప్ర‌స్తుత క్రైసిస్ స‌న్నివేశంలో ఈ రిజ‌ల్ట్ ఎంతో ఉన్న‌త‌మైన‌ది. సినీప‌రిశ్ర‌మ‌ల‌కు బూస్ట్ ఇచ్చేదేన‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు RRR కేవ‌లం ఉత్త‌ర అమెరికాలో 75.7 కోట్లు వ‌సూలు చేసింది. ఇంకా వ‌సూల్ చేస్తోంది. ఈ సినిమా అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద 100కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. RRR అమెరికాలో 10 మిలియన్ డాల‌ర్ క్లబ్ లో చేరింది. ఉత్తర అమెరికాలో కొన్ని భారతీయ చిత్రాలు ఇప్ప‌టికే 10 మిలియన్ డాల‌ర్ కంటే ఎక్కువ వసూలు చేశాయి రాజమౌళి పీరియాడికల్ డ్రామా ఈ జాబితాలో చేరింది.

ఈ చిత్రం మొదటి సోమవారం 464576 డాల‌ర్లు వసూలు చేసింది. దీంతో మొత్తం వసూళ్లు 9902104 డాల‌ర్లకి చేరుకుంది. మంగళవారం ప్రారంభ టికెట్ అమ్మకాలతో ఈ చిత్రం 10 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ దశకు చేరుకోవడానికి మరో 1.5 మిలియన్ డాల‌ర్ల‌ గ్రాస్ కావాలి. అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 భారతీయ చిత్రాలను ప‌రిశీలిస్తే.. #బాహుబలి 2 - 20571695 డాల‌ర్లు.. దంగల్ - 12369237 డాల‌ర్లు.. పద్మావత్ - 12159660 డాల‌ర్లు.. వ‌సూలు చేశాయి. RRR - 10 మిలియన్ డాల‌ర్లు సాధించి ఇంకా వ‌సూలు చేస్తోంది. PK - 8564832 డాల‌ర్లు వ‌సూలు చేసింది.

రామ్ చరణ్- రామారావు- అలియా భట్ -అజయ్ దేవగన్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. మార్చి 25న సినిమా విడుద‌లైంది. ఆరంభం మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా బాక్సాఫీస్ రిజ‌ల్ట్ అసాధార‌ణంగా న‌మోదైంది. ఉత్త‌ర భార‌త‌దేశంలో వ‌సూళ్లు అంత‌కంత‌కు పెరుగుతుండ‌డం ట్రేడ్ లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.