Begin typing your search above and press return to search.
RRR ప్రభంజనం.. తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు..!
By: Tupaki Desk | 26 March 2022 11:31 AM GMTదర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి బాక్సాఫీస్ చరిత్రను తిరగరాశారు. తన సినిమాతో తానే పోటీ పడుతున్నాడు. 'బాహుబలి' సినిమాతో సంచలనం సృష్టించిన జక్కన్న.. ఇప్పుడు RRR చిత్రంతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ఓపెనింగ్ డే నాడు ప్రపంచ వ్యాప్తంగా రూ. 223 కోట్ల గ్రాస్ రాబట్టిన 'ఆర్.ఆర్.ఆర్'.. ఒక్క రోజులో అత్యధిక కలెక్షన్లు అందుకున్న భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్న ఈ చిత్రం.. ఎన్నోసార్లు వాయిదా పడి ఎట్టకేలకు నిన్న శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాలతో వచ్చి అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డులు సృష్టించింది.
రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన RRR.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందు నుంచి అందరూ ఊహించారు. కాకపోతే ఏస్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే తొలి రోజే అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని.. 'బాహుబలి 2' పేరు మీదున్న రికార్డులను అధిగమిస్తుందని ఎవరూ ఊహించలేదు.
'ఆర్.ఆర్.ఆర్' మూవీ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే ₹ 223 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. యూఎస్ ప్రీమియర్ సేల్స్ లో అత్యధికంగా 3 మిలియన్ల డాలర్లకు పైగా రాబట్టగా.. ఓపెనింగ్ డేతో కలుపుకొని 5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. మిగతా దేశాలలో ₹ 25 కోట్ల వరకూ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే మొదటి రోజు భారీ ఫిగర్స్ నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ₹ 75 కోట్లు - నైజాంలో ₹ 27.5 కోట్లు కలుపుకుని 102.5 కోట్ల వసూళ్ళు వచ్చాయి. నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోవడంతో ఆశించినంత రాకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ₹ 25 కోట్లు కలెక్షన్స్ సాధించింది.
వరల్డ్ వైడ్ RRR కలెక్షన్స్ వివరాలు పరిశీలిస్తే...
ఏపీ - ₹ 75 cr
నైజాం - ₹ 27.5 cr
కర్ణాటక - ₹ 14.5 cr
తమిళనాడు - ₹ 10 cr
కేరళ - ₹ 4 cr
నార్త్ ఇండియా - ₹ 25 cr
ఇండియా మొత్తం: ₹ 156 cr
యూఎస్ఏ - ₹ 42 cr
నాన్ యుఎస్ - 25 cr
వరల్డ్ వైడ్ (మొత్తం) - ₹ 223 cr
స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల స్పూర్తితో కల్పిత కథ ఆధారంగా ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రం తెరకెక్కింది. ఇందులో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచారు. అలియా భట్ - అజయ్ దేవగన్ - ఒలివియా మోరిస్ - సముద్ర ఖని - శ్రియా - రే స్టీవెన్ సన్ - అలిసన్ డూడి కీలక పాత్రలు పోషించారు.
RRR చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. కేవీ విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. బుర్రా సాయి మాధవ్ మాటలు రాశారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని 2డీతో పాటు 3డీ ప్లాటినం - డోల్బీ పిక్చర్స్ ఫార్మాట్లలో విడుదల చేశారు.