Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్ విడుదల వేళ తీవ్రవిషాదం

By:  Tupaki Desk   |   25 March 2022 6:48 AM GMT
ఆర్ఆర్ఆర్ విడుదల వేళ తీవ్రవిషాదం
X
దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా మేనియా ఓ రేంజ్ లో నెలకొంది. తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశమంతా ఇదే హైప్ నెలకొంది. నిన్న రాత్రి నుంచే థియేటర్స్ వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ హంగామాతో థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

అయితే ఆర్ఆర్ఆర్ విడుదల వేళ విషాదం నెలకొంది. సినిమాను ప్రదర్శిస్తున్న ఓ సినీ థియేటర్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఆర్ఆర్ఆఱ్ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ లో అభిమాని గుండెపోటుతో మృతిచెందాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్ లో గుండెపోటుతో మృతిచెందిన అభిమానిని అంబేద్కర్ నగర్ కు చెందిన ఓబిలేసుగా గుర్తించారు. సినిమా రిలీజ్ సందర్భంగా గత రాత్రి నుంచి సినిమా థియేటర్ వద్ద ఓబిలేసు సందడి చేసినట్టు తెలుస్తోంది. ఇతడికి గతంలోనే హార్ట్ ఎటాక్ రావడంతో వైద్యులు స్టంట్ వేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షోకి తెల్లవారుజామున సినిమా థియేటర్ కు వచ్చిన ఓబులేషు ప్రదర్శన సమయంలో సృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన తోటివారు హుటాహుటిన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆస్పత్రికి తరలించేలోపే ఓబులేషు మృతిచెందాడు. దీంతో థియేటర్ వద్ద తీవ్ర విషాదం నెలకొంది.

-ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోకు వెళుతుండగా ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

చిత్తూరు జిల్లా వి.కోట దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీ బెనిఫిట్ షోకు వెళుతున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరు ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో టికెట్ల కోసం వి.కోటకు వెళ్లారు. ఆ సమయంలోనే ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు రామకుప్పం. వీకోటకు చెందిన యువకులుగా గుర్తించారు.