Begin typing your search above and press return to search.
'RRR' - 3D ఊపేం కనిపించలేదే..బుకింగ్ ఎలా బాస్!
By: Tupaki Desk | 22 March 2022 4:28 AM GMTఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. రిలీజ్ కి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. రోజులు సమీపీస్తున్న కొద్ది చరణ్-తారక్ అభిమానుల్లో మరింత ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుంది. రిలీజ్ గడియలు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని 2డీతో పాటు 3 డీలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నన్న సంగతి తెలిసిందే.
`3డీ` ఆలోచన అనేది మేకర్స్ కి మధ్యలో తట్టింది. లాక్ డౌ న్ సమయంలో జక్కన్న అండ్ కో ఖాళీగా ఉన్న సమయంలో త్రీడీ ఆలోచన చేసి ఆ టెక్నాలజీతోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మరింత విజువల్ ట్రీట్ గా హైలైట్ అవుతుందని భావించి ముందుకు కదిలారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో 2డీ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు 3డీలో సినిమా చూడటం ఎలా అనే సందేహం ఇప్పుడు కొంత మంది అభిమానుల్ని వెంటాడుతుంది.
తెలుగు రాష్ర్టాల్లో కొన్ని చోట్ల 3డీ థియేటర్లు ఉన్నా 2డీలోనే రిలీజ్ అవుతున్నట్లు బుకింగ్స్ లో చూపిస్తుంది. 3డీ బుకింగ్స్ కనిపించలేదు. దీంతో 3డీ ఫార్మెట్ ఫ్యాన్స్ లో గందరగోళం నెలకొంది. అసలు `ఆర్ ఆర్ ఆర్` 3డీలో రిలీజ్ అవుతుందా? అన్న సందేహం మొదలైంది. మరి దీనిపై రాజమౌళి అండ్ కో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ 3డీ వెర్షర్ రిలీజ్ ని పెద్దగా ప్రమోట్ చేయని పరిస్థితి మొదటి నుంచి కనిపిస్తుంది.
2డీ రిలీజ్ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టి మేకర్స్ ముందుకు కదులుతున్నారు. 3డీలో సినిమా చూడాలంటే అదనంగా కాస్త ఎక్కువగానే టిక్కెట్ కి ఖర్చు చేయాల్సి ఉంది. 3డీ వెర్షన్ కేవలం ఓ వర్గం ఆడియన్స్ మాత్రమే వీక్షించే అవకాశం ఉంది. పైగా ఈ వెర్షన్ తెలుగు రాష్ర్టాల్లో అన్ని చోట్లా కూడా అందుబాటులో ఉండదు. మెట్రోపాలిటన్ సిటీస్ సహా కొన్ని ముఖ్యమైన నగరాల్లొనే 3డీ లో వీక్షించే అవకాశం ఉంది. ఆ కారణం సహా 3డీ టిక్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేకర్స్ 3డీ రిలీజ్ వెర్షన్ ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు.
ప్రచార కార్యక్రమాల్లోనూ 3డీ రిలీజ్ గురించి ఫోకసింగ్ మాట్లాడింది లేదు. సాధారణంగా 3డీ రిలీజ్ అంటే మీడియాలోనూ బోలెడంత హైప్ వస్తుంది. కానీ ఆర్ ఆర్ ఆర్ విషయంలో 3డి హైప్ ఏమాత్రం క్రియేట్ అవ్వలేదు. అందులో మేకర్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదే. మార్చి 25న రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పటివరకూ 3డీ వీక్షణపై సరైన క్లారిటీ దొరికే అవకాశం లేదు. లేదా! మీడియా కథనాల నేపథ్యంలో రాజమౌళి ముందుకొచ్చి వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
అయితే అమెరికా సహా భారత్ లోని మెట్రో సిటీస్ లో చాలా చోట్ల 3డీ వెర్షన్ కి ఫ్యాన్స్ పెద్ద పీఠ వేసే అవకాశం ఉంది. ఇప్పటికే 3డీ సినిమాలకు మెట్రో జనాలు అలవాటు పడి ఉన్నారు. అలాగే ఉత్తరాది అభిమానులు 3డీ సినిమాలు వీక్షించడానికి అమితాసక్తి చూపిస్తారు. ఈ రెండు అంశాలు `ఆర్ ఆర్ ఆర్` 3డీ ఫార్మెట్ టిక్కెట్ తెగడానికి ఉపయుక్తంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.