Begin typing your search above and press return to search.

హిందీ బాక్సాఫీస్.. 100 కోట్ల క్లబ్ లో RRR

By:  Tupaki Desk   |   30 March 2022 4:33 AM GMT
హిందీ బాక్సాఫీస్.. 100 కోట్ల క్లబ్ లో RRR
X
RRR విష‌యంలో ముంబై మీడియా ఏం ఊహిస్తే అందుకు భిన్నంగా జరుగుతోంది. ఆరంభం ఆర్.ఆర్.ఆర్ పై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్తం చేసింది ముంబై మీడియా. ఇది మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అంటూ స‌రిపుచ్చారు చాలా మంది క్రిటిక్స్. కానీ బాక్సాఫీస్ ఫ‌లితం వేరుగా ఉంది. హిందీ ప్రేక్ష‌కులు మ‌రోసారి యాక్ష‌న్ కి ఎమోష‌న్ కి ప‌ట్టంగ‌ట్టారు.
SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR గత వారం శుక్రవారం విడుదలై ఇంటా బ‌య‌టా క‌లెక్ష‌న్ల‌ మోత మోగించింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను పొందింది.

రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్- అలియా భట్ -అజయ్ దేవగణ్ నటించిన ఈ చిత్రం అత్యంత చర్చనీయాంశంగా మారింది. ప్రారంభ రోజు తదుపరి ప్రారంభ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లిన తర్వాత ఈ చిత్రం మొదటి సోమవారం కూడా వ‌సూళ్ల ప‌రంగా స్థిరంగా ఉంది.

తాజా బాక్సాఫీస్ రిపోర్ట్ లో RRR మొదటి సోమవారం కలెక్షన్ లను 2022 మునుపటి విడుదలలతో పోల్చితే చార్ట్ లో నంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. రూ. 17 కోట్ల మేర క‌లెక్ష‌న్ల‌తో కశ్మీర్ ఫైల్స్ కలెక్షన్ లను ఆర్.ఆర్.ఆర్ అధిగమించింది. క‌శ్మీర్ ఫైల్స్ రూ. 15.05 కోట్లతో 2022లో అత్యధిక మొదటి సోమవారం గ్రాసర్ గా నిలిచింది. ఇది కాకుండా RRR వ‌సూళ్ల‌ను చూస్తే.. గంగూబాయి కతియావాడి వంటి ఇతర విడుదలల మొదటి సోమవారం కలెక్షన్ లను అధిగమించింది. గంగూభాయి రూ. 8.19 కోట్లు.. బచ్చన్ పాండే రూ. 3.37 కోట్లు.., బదాయి దో రూ. రూ. 1.85 కోట్లు.. రాధే శ్యామ్ రూ. 1.50 కోట్లు.. ఝండ్ రూ. 1 కోట్లు వ‌సూలు చేశాయి. వాటిని కొట్టేస్తూ ఏకంగా 17.5 కోట్లు ఆర్.ఆర్.ఆర్ వ‌సూలు చేసింది.

ప్రస్తుతం 8000 స్క్రీన్లలో విస్తృతంగా విడుదలైన RRR బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం వారం గడిచేకొద్దీ ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా మరింత వృద్ధి చెందుతుంది. వాస్తవానికి RRR క‌లెక్ష‌న్స్ రూ. 91.50 కోట్లు రూ. దాటుతుందని అంచనా. 5వ రోజు కే 100 కోట్ల మార్క్ ను అందుకుంది.

2022లో అత్యధిక మొదటి సోమవారం వసూళ్లు చేసినవి..
RRR - రూ. 17 కోట్లు
కాశ్మీర్ ఫైల్స్ - రూ. 15.05 కోట్లు
గంగూబాయి కతియావాడి – రూ. 8.19 కోట్లు
బచ్చన్ పాండే - రూ. 3.37 కోట్లు
బదాయి దో - రూ. 1.85 కోట్లు
రాధే శ్యామ్ - రూ. 1.50 కోట్లు
ఝుండ్ - రూ. 1 కోట్లు
గా తెలుస్తోంది.