Begin typing your search above and press return to search.
RRR ను బాయ్ కాట్ చెయ్యండి..!!
By: Tupaki Desk | 23 March 2022 9:31 AM GMTస్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల ఆధారంగా కల్పిత కథతో తెరకెక్కిన మ్యాగ్నమ్ ఓపస్ “ఆర్.ఆర్.ఆర్” (రౌద్రం రణం రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు.
RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. మరికొన్ని గంటల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ థియేటర్లోకి వస్తుందనగా.. ఇప్పుడు కన్నడిగులు ఈ సినిమా పై ఫైర్ అవుతున్నారు. సినిమాను కర్ణాటకలో బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియా పిలుపునిచ్చారు.
'ఆర్.ఆర్.ఆర్' సినిమా కన్నడ వెర్షన్ ని బెంగుళూరులో తెలుగు వెర్షన్ కంటే తక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారని.. ఇది తమ భాషను అవమానించడమే అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్ణాటకలో భారీగా నిర్వహించినప్పుడు.. సినిమాను కూడా తమ మాతృ భాషలోనే అధిక థియేటర్లలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అలానే దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన “జేమ్స్” సినిమాపై RRR రిలీజ్ ప్రభావం పడుతోందని అప్పూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమ అభిమాన హీరో చివరి సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లనూ రాజమౌళి చిత్రం ఆక్యుఫై చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో జక్కన్నను ట్రోల్ చేస్తూ 'Boycott RRR in Karnataka' అనే హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
నిజానికి బెంగుళూరులో తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం ఉండటంతో తెలుగు వెర్షన్ ను అధిక థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో అనూహ్యంగా RRR సినిమాపై నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. దీంతో కన్నడ సీమలో ఈ మూవీ రిలీజ్ పై కాస్త గందరగోళం నెలకొంది.
అలానే 'ఆర్ ఆర్ ఆర్' విడుదలైతే పునీత్ రాజ్ కుమార్ సినిమాపై ప్రభావం చూపుతుంది కాబట్టి.. RRR కోసం తమ చసిమాను థియేటర్ల నుండి తీసివేయవద్దని డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లను 'జేమ్స్' దర్శకుడు చేతన్ కుమార్ అభ్యర్థించాడు.
పునీత్ రాజ్ కుమార్ అభిమానుల భావోద్వేగాలను గౌరవించాలని.. రెండో వారంలో మంచి వసూళ్లను రాబట్టిన సినిమాను తీసివేయవద్దని ఎగ్జిబిటర్లకు విజ్ఞప్తి చేస్తూ చేతన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జేమ్స్ అప్పూ చివరి చిత్రమని.. ఇది సినిమా కాదని.. ఒక ఎమోషన్ అని దర్శకుడు పేర్కొన్నారు.
దీనిపై 'ఆర్ ఆర్ ఆర్' మేకర్స్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ కలిసి ఈ ఇష్యూని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.