Begin typing your search above and press return to search.

రాజమౌళి కాకుండా మరెవ్వరైనా ఫ్యాన్స్ వార్‌ జరిగేదేమో!

By:  Tupaki Desk   |   26 March 2022 4:28 AM GMT
రాజమౌళి కాకుండా మరెవ్వరైనా ఫ్యాన్స్ వార్‌ జరిగేదేమో!
X
ఆర్ఆర్ఆర్‌ సినిమా విడుదల అయ్యి భారీ విజయం దిశగా దూసుకు పోతుంది. బాహుబలి రేంజ్ లో కాకున్నా ఇది కూడా భారీ విజయం అంటూ ఇప్పటికే చాలా విశ్లేషణలు వస్తున్నాయి. వసూళ్ల విషయం పక్కన పెడితే రాజమౌళి ఇద్దరు హీరోలను.. అది కూడా భారీ హీరోలను.. స్టార్‌ హీరోలను ఇంతటి భారీ యాక్షన్ సినిమా లో ఎమోషన్ సినిమా లో బ్యాలన్స్ చేసి చూపించడం అంటే మామూలు విషయం కాదు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమా లో హీరోల పాత్రలకు ఎలివేషన్స్ ఎక్కువ లేదు.. భారీ యాక్షన్ సన్నివేశాలు ఒక హీరోకు ఉండి మరోక హీరోకు లేవు అనే విషయాలు రాలేదు. కనుక ఆ సినిమా ఇద్దరు హీరోలను సంతృప్తి పర్చింది అనడంలో సందేహం లేదు. అయితే ఆర్ ఆర్ ఆర్‌ సినిమా విషయంలో పూర్తి విభిన్నం. ఇద్దరు హీరోలకు సంబంధించిన ఎమోషన్‌ సన్నివేశాలు.. యాక్షన్ సన్నివేశాలు.. పాత్రల ప్రాముఖ్యత ఇలా పలు విషయాలు పరిగణలోకి వస్తాయి.

వాటన్నింటిని కూడా జక్కన్న సరిగ్గా మేనేజ్ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న ఇద్దరు హీరోలను బ్యాలన్స్ గా చూపించడం కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యం అయ్యింది. సినిమా విడుదలకు ముందు ఇద్దరు హీరోల అభిమానులు థియేటర్ల వద్ద ఇంకా ప్లెక్సీల విషయంలో గొడవలు పడటం.. సోషల్‌ మీడియాలో విమర్శలు చేసుకోవడం జరిగింది. కాని సినిమా విడుదల తర్వాత సైలెంట్‌.

తమ హీరోకు దక్కాల్సింది దక్కింది అంటూ ఇద్దరు హీరోల అభిమానులు కూడా నూటికి నూరు శాతం సంతృప్తిగా ఉన్నారు. అందుకే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాస్త అటు ఇటు అయినా.. ఒక హీరోను డామినేట్‌ చూపించి.. ఒక హీరోను తక్కువ చేసి చూపించినా కూడా బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఏమో కాని.. థియేటర్ల వద్ద గ్లాస్ లు బద్దలు అయ్యేవి.. ఇంకా రకరకాలుగా అభిమానులు రచ్చ రచ్చ చేసేవారు అనడంలో సందేహం లేదు.

కేవలం రాజమౌళి దర్శకత్వంలో సినిమా అవ్వడం వల్లే ఎలాంటి గొడవలు జరగలేదు. మరే దర్శకుడు అయినా ఈ సినిమాను లేదా ఈ ఇద్దరు హీరోలతో సినిమా చేసి ఉంటే ఖచ్చితంగా బ్యాలన్స్ తప్పేది.. జనాలు మరియు అభిమానుల నుండి విమర్శలు వచ్చేవి. అభిమానుల మద్య గొడవలు జరిగేవి అనడంలో సందేహం లేదు.

అద్బుతమైన బ్యాలన్స్ తో ఇద్దరు హీరోలకు సమాన ప్రాముఖ్యత ఇస్తూనే.. ఎమోషన్స్ మరియు యాక్షన్ సన్నివేశాలను షేర్‌ చేశాడు. అది అభిమానులు మారు మాట్లాడకుండా చేసింది. ఇందుకే మల్టీ స్టారర్ సినిమాలను చేసేందుకు యంగ్‌ స్టార్‌ హీరోలు ముందుకు రారు. రాజమౌళి దర్శకత్వంలోనే మళ్లీ ఈ స్థాయి మల్టీ స్టారర్ రావాల్సిందే కాని మరెవ్వరు అందుకు ప్రయత్నించక పోవచ్చు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం