Begin typing your search above and press return to search.
ఆర్ఆర్ఆర్ లోని ఆ ఫ్ల్యాష్ బ్యాక్ మొత్తం లేపేశారట!
By: Tupaki Desk | 13 April 2022 5:31 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకు పోతుంది. సినిమా మూడు గంటల నిడివికి పైగా వచ్చింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు రాజమౌళి మరో 20 నుండి 30 నిమిషాల సన్నివేశాలను అయిష్టంగానే ఎడిట్ చేశాడట.
సినిమాలోని మల్లీ.. కొమురం భీమ్ ఫ్ల్యాష్ బ్యాక్ సన్నివేశాలు కీలకంగా ఉంటాయట. ఆ సన్నివేశాలను చాలా ఖర్చు చేసి అత్యంత భారీగా తెరకెక్కించారు. కాని ఫైనల్ ఎడిట్ లో లేదు. అందుకు సంబంధించిన ఒక ఫోటోను ఆహ్మ్రీన్ అంజుమ్ షేర్ చేసింది. మీరు ఈ సన్నివేశాన్ని సినిమాలో చూడలేదు. ఫైనల్ ఎడిటింగ్ లో దీన్ని తొలగించడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది.
సినిమాలో ఇంకా చాలా సన్నివేశాలను షూట్ చేసి ఫైనల్ వర్షన్ లో ఎడిట్ చేసి లేపేశారు. ఇలా కష్టపడి తెరకెక్కించిన సన్నివేశాలను.. ఖర్చు చేసి చిత్రీకరించిన సన్నివేశాలను ఎందుకు తొలగించడం అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాను కూడా బాహుబలి తరహా లో రెండు పార్ట్ లుగా విడుదల చేస్తే బాగుండేది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని పలు సన్నివేశాలు కూడా కన్నుల విందుగా ఉన్నాయి. సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశం కూడా అద్బుతంగా ఉండటంతో పాటు ఎక్కడ కూడా బోరింగ్ గా అనిపించలేదు. రాజమౌళి సినిమా అంటేనే అలా ఉంటుంది. మూడు గంటలు కాదు మరో గంట ఉన్నా కూడా చూసేందుకు ప్రేక్షకులు సిద్దంగా ఉంటారు. కనుక ఇంకాస్త ఎక్కువ సమయంను సినిమా ఉంచితే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం.
ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లను బ్రేక్ చేసింది. అతి త్వరలోనే ఈ సినిమా 1200 కోట్ల వసూళ్లను కూడా రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా పైసా వసూళ్ మూవీ ఉంటుందని అంటున్నారు. కనుక ఎడిటింగ్ చేసిన సన్నివేశాలను మరియు రా సన్నివేశాలను ఓటీటీ లేదా యూట్యూబ్ ద్వారా విడుదల చేయాలని ఎన్టీఆర్ మరియు చరణ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.