Begin typing your search above and press return to search.

మొదటి రోజు నుండే 'బాహుబలి 2' రికార్డుల బ్రేక్‌ షురూ

By:  Tupaki Desk   |   23 March 2022 10:41 AM GMT
మొదటి రోజు నుండే బాహుబలి 2 రికార్డుల బ్రేక్‌ షురూ
X
ప్రభాస్.. రాజమౌళి ల కాంబోలో వచ్చిన బాహుబలి 2 సినిమా సంచలన రికార్డులను ఇన్ని సంవత్సరాలు అయినా ఏ ఒక్క సినిమా కూడా బ్రేక్‌ చేయలేక పోతుంది. లాంగ్‌ రన్‌ లో వచ్చిన వసూళ్లతో పాటు పలు ఏరియాల్లో విడి విడిగా వచ్చిన వసూళ్లను కాని.. డేస్ వైజ్‌ గా వచ్చిన వసూళ్లను కాని ఏ ఇండియన్‌ సినిమా బీట్‌ చేయలేక ఆ రికార్డులు ఏళ్ల తరబడి అలాగే కంటిన్యూ అవుతున్నాయి.

బాహుబలి 2 మొదటి రోజు దాదాపుగా 43 కోట్ల రూపాయల షేర్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను నమోదు చేసిన బాహుబలి 2 ని ఇప్పుడు ఆర్‌ ఆర్‌ ఆర్‌ క్రాస్ చేయడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. మొదటి రోజు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా 60 నుండి 62.5 కోట్ల షేర్‌ ను దక్కించుకునే అవకాశం ఉందని ఇప్పటికే నమోదు అయిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా తెలుస్తోంది.

జక్కన్న తన బాహుబలి రికార్డును తన ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తో బ్రేక్ చేయడం ఖాయం అంటూ మొదటి నుండి అంతా అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు నమ్మినట్లుగానే అనుకుంటున్నట్లుగానే ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా వసూళ్ల విషయంలో ఇండియన్ సినిమా కు సరికొత్త హద్దులు క్రియేట్‌ చేయబోతున్నట్లుగా అనిపిస్తుంది. మొదటి రోజు వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు నమోదు అవ్వడం ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

ఇక లాంగ్‌ రన్ విషయంలో బాహుబలి 2 సినిమా వసూళ్లను బీట్‌ చేయాలంటే చాలా కష్టమే. కాని జక్కన్న సినిమా ఆర్‌ ఆర్‌ ఆర్‌ కి మాత్రం అది కష్టం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సినిమాకు మినిమంగా టాక్ వచ్చినా కూడా ఖచ్చితంగా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆర్ ఆర్ ఆర్‌ రికార్డుల వేట మొదటి రోజు మొదలు అయ్యి లాంగ్ రన్‌ వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రామ్‌ చరణ్ ను అల్లూరి సీతరామరాజు గా ఎన్టీఆర్ ను కొమురం భీమ్ గా రాజమౌళి ఈ సినిమా లో చూపించబోతున్న విషయం తెల్సిందే. ఆ రెండు పేర్లు జనాలకు తెలిసినవే. కనుక ఆసక్తి చాలా వ్యక్తం అవుతుంది. అయితే వారిద్దరి గురించి తెలియని విషయాలను కల్పిత కథనంతో చూపించబోతున్నట్లుగా జక్కన్న చెబుతున్నాడు. విజువల్‌ వండర్‌ గా ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు ప్రేమించే విధంగా సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అందుకే రికార్డుల మోత మ్రోగడం ఖాయం.