Begin typing your search above and press return to search.
'ఆర్ ఆర్ ఆర్' టీమ్ సుడిగాలి ప్రమోషన్స్!
By: Tupaki Desk | 17 March 2022 11:30 AM GMTరాజమౌళి సినిమా అనగానే ప్రపంచంలోని ఆయన అభిమానులందరి దృష్టి ఆ వైపు తిరుగుతుంది. ఎందుకంటే రాజమౌళి ఎంచుకునే కథలు .. కథానాన్ని ఆయన నడిపించే తీరు .. పాత్రలను మలిచే విధానం వేరుగా ఉంటుంది. అందువలన ఆయన సినిమాలను ప్రేక్షకులంతా ఎంతగానో ప్రేమిస్తుంటారు .. ఆదరిస్తుంటారు. ఒక సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా ఆయన కథలు ఉంటాయి. వెన్నెల్లో పడుకుని చందమామ కథలు చదువుతున్నంత అందంగా కథలు చెప్పడం ఆయన ప్రత్యేకత. సినిమాలో ప్రతి అంశానికి ఆయన ఏదో ఒక ప్రత్యేకతను ఆపాదిస్తూనే ఉంటారు.
అలాంటి ఆయన నుంచి 'ఆర్ ఆర్ ఆర్' వస్తోంది. అయితే ఈ కథ కల్పన కాదు .. అలాగని చెప్పేసి పూర్తి నిజమూ కాదు. చరిత్రకి కాస్త కల్పనను జోడించి అందించే కథ. దాంతో ఈ సినిమాలో రాజమౌళి ఏం చెప్పనున్నారు? ఎలా చెప్పనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ ను .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ను చూపించనున్నారు. కీలకమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్స్ తో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా టీమ్ హైదరాబాద్ లో ప్రమోషన్స్ పరంపర కొనసాగిస్తూనే ఉంది. 18వ తేదీన ఇక్కడ ప్రమోషన్స్ చూసుకుని ఆ తరువాత అదే రోజున 'దుబాయ్'లోను ప్రమోషన్స్ ను కొనసాగించనున్నారు. 19వ తేదీన బెంగుళూర్ లో ప్రమోషన్స్ చేయనున్నారు. 20వ తేదీన బరోడా - ఢిల్లీలలో ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు. అలాగే 21వ తేదీన అమృత్ సర్ .. జైపూర్ లలో ప్రమోషన్స్ సాగనున్నాయి. 22వ తేదీన కోల్ కతా - వారణాసిలలో ప్రమోషన్స్ ను పూర్తి చేసుకుని తిరిగి 23వ తేదీన హైదరాబాద్ కి చేరుకోనున్నారు.
కరోనా కారణంగా ఏర్పడిన ప్ర్రతికూల పరిస్థితులు .. సినిమా షూటింగులు జరిగే పరిస్థితులు గానీ .. విడుదల చేసే పరిస్థితులుగాని లేకపోవడం వలన ఈ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి కరోనా కొంత గ్యాప్ తీసుకుకోవడం వలన ఈ నెల 25వ తేదీని ఫిక్స్ చేశారు. ఇంత జరిగినా దర్శక నిర్మాతలు నవ్వుతూనే .. సందడి చేస్తూనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రమోషన్స్ ను కొనసాగిస్తుండటం విశేషం. రిలీజ్ తరువాత ఈ సినిమా రికార్డుల పరంపర ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ఆగుతుందా అనే అందరూ ఎదురుచూస్తున్నారు.