Begin typing your search above and press return to search.

నార్త్ లో RRR పై బజ్ లేకపోవడానికి కారణాలు ఇవేనా..?

By:  Tupaki Desk   |   24 March 2022 9:54 AM GMT
నార్త్ లో RRR పై బజ్ లేకపోవడానికి కారణాలు ఇవేనా..?
X
ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''. కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన ఈ మల్టీస్టారర్.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రమోషన్స్ కోసం భారీగానే ఖర్చు పెట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ - స్పెషల్ ఇంటర్వ్యూలతో పాటుగా చిత్ర బృందం దేశంలోని ప్రధాన నగరాలు చుట్టివచ్చింది. అయినప్పటికీ నార్త్ లో ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ లేదు.

RRR విడుదలకు వారం ముందే అన్ని ప్రధాన ఏరియాలలో టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఆశాజనకంగా ఉండగా.. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. తమిళనాడు - కర్ణాటక - కేరళలలో తట్రిపుల్ ఆర్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి.

యూఎస్ఏలో ప్రీ సేల్స్ లో అదరగొడుతుండగా.. అక్కడ కూడా కేవలం తెలుగు వెర్షన్ పై మాత్రమే క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాదిలో అయితే అన్ని స్క్రీన్స్ లో గో గ్రీన్ అన్నట్లుగా.. ఖాళీగా కనిపిస్తున్నాయి. అన్ని పమెయిన్ సిటీస్ లోనూ ఇదే పరిస్థితి ఉంది.

బ్లాక్ బస్టర్ 'బాహుబలి' పేరు చెప్పుకుని RRR చిత్రాన్ని భారీ రేట్లకు విక్రయించారు. ఖర్చు పెట్టిన దానికంటే డబుల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మేకర్స్ ఫస్ట్ డే 20-25 కోట్ల వరకు ఆశించారు. కానీ ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మాత్రం ఆ నంబర్ కష్టమే అనిపిస్తోంది.

దీంతో 'బాహుబలి' క్రియేట్ చేసిన బజ్ ను RRR ఎందుకు సృష్టించలేకపోయిందనే చర్చ మొదలైంది. రెండు సినిమాలను కంపేర్ చేస్తూ.. దీనికి కారణాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో అందరూ విశ్లేషిస్తున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో అలియాభట్ - అజయ్‌ దేవగన్‌ లు తప్ప సినిమాలోని ప్రధాన పాత్రదారులకు ఉత్తరాది ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. అలియా పై ఉన్న నెగిటివిటీ మరియు నెపోటిజం మచ్చలు ఇంకా అలానే ఉండటం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ పై ప్రభావం చూపించాయని అంటున్నారు.

'బాహుబలి' సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే డ్యూయెట్‌లు మరియు హీరోయిన్ల గ్లామర్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కానీ RRR లో అలాంటివేమీ లేవు.. అసలు వాటికి అవకాశమే లేదు. అలానే ఈ సినిమాలో పాటలు జనాలకు అనుకున్నంత రేంజ్ లో ఎక్కలేదు.

ఒక్క 'నాటు నాటు' పాట మినహా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే మరో సాంగ్ లేదు. బ్రిటిష్ ఇండియా బ్యాక్‌ డ్రాప్ అనేది చాలా పాతది. ఇప్పటికే నార్త్ ఆడియన్స్ అనేక సినిమాలు చూసి ఉన్నారు.

కోవిడ్ పాండమిక్ కారణంగా అనేకసార్లు పోస్ట్ పోన్ అవడం వల్ల కూడా చాలా మందిలో RRR సినిమాపై ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఈ చిత్రాన్ని 'బాహుబలి' దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పలు కారణాల వల్ల ఉత్తరాదిలో ఆశించిన బజ్ లేదని టాక్ నడుస్తోంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా యూఎస్ ప్రీమియర్ షోల నుంచి వచ్చే టాక్ ని బట్టి బుకింగ్స్ పుంజుకునే అవకాశం లేకపోలేదు. ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం గ్యారెంటీ. ఒకవేళ కొంచం అటు ఇటు అయితే మాత్రం నార్త్ లో 'రాధేశ్యామ్' సినిమా పరిస్థితే RRR కు వస్తుందనడంలో సందేహం లేదు. ఏం జరుగుతుందో చూడాలి.