Begin typing your search above and press return to search.

ట్రిపుల్ ఆర్ ఎఫెక్ట్ : మాస్ హిస్టిరియా ఇప్ప‌ట్లో ఆగేలా లేదు !

By:  Tupaki Desk   |   2 April 2022 7:46 AM GMT
ట్రిపుల్ ఆర్ ఎఫెక్ట్  : మాస్ హిస్టిరియా ఇప్ప‌ట్లో ఆగేలా లేదు !
X
ట్రిపుల్ హిట్ తో దేశ వ్యాప్తంగా మ‌రోసారి తెలుగు చిత్ర సీమ వైపు గ‌ర్వంగా చూస్తోంది. ఏడు వంద‌ల కోట్ల రూపాయ‌లు దాటి క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. సినిమా విడుద‌లైన నాటి నుంచి నేటి వ‌ర‌కూ క‌లెక్ష‌న్ల సునామీ వ‌స్తోంది. ప్ర‌భంజ‌న సృష్టి కొన‌సాగుతోంది. ఓ విధంగా మాస్ హిస్టీరియా అన్న‌ది మొద‌లు అయ్యాక ఆగ‌డం క‌ష్టం. ఆప‌డం అసాధ్యం కూడా ! ఈ కోవ‌లోనే ట్రిపుల్ ఆర్ ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ను, కొనుగోలు చేసిన బ‌య్య‌ర్ల‌ను, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను, ఎగ్జిబిట‌ర్ల‌నూ సేఫ్ జోన్ లో ఉంచింది.

ఇంతకుమించిన ఉగాది రాజ‌మౌళి జీవితంలో కానీ చ‌ర‌ణ్, తార‌క్ జీవితాల్లో కానీ రానే రాదు.ష‌డ్రుచుల ఉగాదిలో తీపే ఎక్కువ. ఆ విధంగా ఈ విజ‌యం తార‌క్ క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం. చ‌ర‌ణ్ క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం. ఏకంగా ఆ ఇద్ద‌రూ క‌లిసి క‌న్న క‌ల‌కు రాజ‌మౌళి క‌న్న క‌ల స‌రిజోడుగా నిలిచి మంచి విజ‌యాల‌ను అందిస్తోంది. ఇది బాలీవుడ్ కు సంబ‌రం. ఇది ప్ర‌పంచ సినిమాకే సంబ‌రం.

వాస్త‌వానికి మ‌న క‌థ‌లంటే పెద్ద‌గా ఆస‌క్తి చూపని బాలీవుడ్ ఇప్పుడు మ‌న అనుకుంటున్న ప్ర‌తి ప్రాజెక్టులోనూ పైస‌లు పెట్టేందుకు ముందుకు వ‌స్తోంది. అందుకు క‌ర‌ణ్ జోహార్ లాంటి నిర్మాత‌లు ఓ పెద్ద ఉదాహ‌ర‌ణ. అమీర్ ఖాన్ లాంటి హీరోలు మ‌రో పెద్ద ఆక‌ర్ష‌ణ.

అవును! అలియా ట్రిపుల్ ఆర్ కు ఓ పెద్ద ఆక‌ర్ష‌ణ. ఆమె కు ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమా బాలీవుడ్ లో మ‌రింత‌గా వెళ్లింది. కాద‌నం కానీ ఇదంతా సినిమా విడుద‌లకు ముందు, విడుద‌ల త‌రువాత అలియా క‌న్నా దర్శ‌క ధీర రాజ‌మౌళి పేరు మార్మోగింది. ఈ సినిమా క‌న్నా ముందు విడుద‌ల‌యిన పుష్ప చూసి క‌ర‌ణ్ జోహార్ ఆకాశానికి ఎత్తేశాడు.

ఇలాంటి సినిమాలు 70 ల కాలంలో బాలీవుడ్ లో వ‌చ్చేవ‌ని ఇప్పుడు ఆ శ‌కాన్ని కొన‌సాగిస్తున్నార‌ని ఈ చిత్ర నిర్మాత‌నూ, ద‌ర్శ‌కుడ్నీ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. ఇదేవిధంగా కేజీఎఫ్ ను కూడా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. ఓ విధంగా ఇవ‌న్నీ శుభ‌పరిణామాలే! ఒక‌నాటి తెలుగు సినిమా స్థాయి వేరు ఇప్ప‌టి తెలుగు సినిమా స్థాయి వేరు..అని నిరూపణ చేస్తున్న వ్యాపార స‌ర‌ళి ఇక‌పై కూడా ఇదే విధంగా కొన‌సాగాల‌ని ఆశిద్దాం.