Begin typing your search above and press return to search.
అయ్యో ఆర్‌ఆర్‌ఆర్ కష్టాలు కంటిన్యూ.. ఆ రెండు పెద్ద దెబ్బే
By: Tupaki Desk | 1 March 2022 3:30 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనాకు ముందు నుండి ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని భావించిన సమయంలో అనూహ్యంగా కరోనా థర్డ్ వేవ్ చివరి నిమిషంలో వాయిదా పడేలా చేసింది.
సంక్రాంతి బరి నుండి తప్పుకున్న ఆర్ ఆర్ ఆర్ తాజాగా మార్చి 25న విడుదలకు సిద్దం అయ్యింది. సమ్మర్ స్పెషల్ గా ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటి యూనిట్ సభ్యులు ప్రకటించారు. కాని పరిస్థితులు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ కు ఆ తేదీన విడుదల అయితే కాస్త కష్టాలు తప్పక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సాదారణంగా అయితే మార్చి చివరి వారం సేఫ్ జోన్. తెలుగు రాష్ట్రాల్లో పది మరియు ఇంటర్ పరీక్షలు పూర్తి అవుతాయి. కాని ఈసారి కరోనా వల్ల అకడమిక్ ఇయర్ మొత్తం గందరగోళంగా ఉంది. దాంతో మార్చి చివర్లో కాకుండా ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. దాంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా పరీక్షల కు ముందు వస్తుంది. దాంతో విద్యార్థలు ఈ సినిమాను చూడటం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇదే సమయంలో విద్యార్థలు తల్లిదండ్రులు మరియు కూడా సినిమాకు దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు. పరీక్షలు ఈ సినిమా కు ఒక దెబ్బ అయితే మరో అతి పెద్ద దెబ్బ ఐపీఎల్ 2022 అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 25వ తారీకున ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతుండగా.. మార్చి 26వ తారీకున ఐపీఎల్ సంరంభం ప్రారంభం అవ్వబోతుంది. ఈసారి కొత్త జట్లు రావడంతో పాటు ప్రత్యేకంగా గ్రూప్ లుగా మ్యాచ్ లు జరుగబోతున్నాయి.
గ్రూప్ లుగా మ్యాచ్ లు జరగడం మరియు కొత్త ఆటగాళ్లు.. టీమ్ లో కొత్త మార్పులు చేర్పులు వంటి కారణాల వల్ల ఐపీఎల్ పై జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఓపెనింగ్స్ కు ఐపీఎల్ దెబ్బేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయకుండా వాయిదా వేద్దామా అంటే అసలు ఆ అవకాశం మేకర్స్ వద్ద లేదు.
ఒక వేళ మార్చి 25ను మిస్ చేసుకుంటే మళ్లీ నాలుగు అయిదు నెలల వరకు సినిమా విడుదలకు అవకాశం ఉండదు. పెద్ద సినిమాలు. చిన్న సినిమాలు ఇలా అన్ని కూడా డేట్ లు ఫిక్స్ చేసుకున్నాయి. నిర్మాతల మండలిలో చర్చించి మరీ డేట్లు ఖరారు చేయడం జరిగింది. కనుక ఆర్ ఆర్ ఆర్ ను విడుదల వాయిదా వేయడం అనేది సాధ్యం అయ్యే విషయం కాదు.
లాభమో నష్టమో ఐపీఎల్ మరియు పరీక్షలకు పోటీగా విడుదల చేయడమే జక్కన్న ముందున్న లక్ష్యం. జక్కన్న సినిమా ముందు అవేవి నిలవవు అనేది అభిమానుల అభిప్రాయం. ఏం జరుగుతుందో చూడాలి.