Begin typing your search above and press return to search.

#RRR అమెరికాలో నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా

By:  Tupaki Desk   |   16 March 2022 4:30 AM GMT
#RRR అమెరికాలో నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా
X
మోస్ట్ అవైటెడ్ #RRR రిలీజ్ కి ఇంకో 8 రోజుల స‌మ‌య‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టికే టీమ్ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముగ్గురు R లు క‌లిసి మీడియాతో ఇంట‌రాక్ట్ అవుతూ మూవీపై హైప్ పెంచుతూనే ఉన్నారు. అయితే ఈ అంచ‌నాల్ని అందుకునేలా ప్రీటికెట్ సేల్ కూడా అంతే ఇదిగా ఉంద‌ని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ ఇంటా బ‌య‌టా సంచ‌ల‌నంగా మార‌నుంది. తొలి రోజు తొలి వీకెండ్ రికార్డుల మోత మోగించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.

ఈ సినిమాని నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా అమెరికాలో ఏకంగా 1150 లొకేష‌న్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే థియేట‌ర్ల నుంచి కన్ఫ‌ర్మేష‌న్ అందిన‌ట్టు చిత్ర‌బృందం పోస్ట‌ర్ కూడా ముద్రించి రిలీజ్ చేసింది. మార్చి 25న సినిమా రిలీజ‌వుతోంది. 24 న అమెరికాలో ప్రీమియ‌ర్లు ప‌డ‌నున్నాయి. అమెరికాలో ఇంత‌కుముందు ఎప్పుడూ విన‌నన్ని స్క్రీన్ల‌లో విడుద‌ల చేస్తున్నందుకు ఆర్.ఆర్.ఆర్ టీమ్ సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.

యూరప్ లో భారీగా విడుదల

తెలుగు సినిమాకి బ‌ల‌మైన మార్కెట్ గా ఉన్న అమెరికాతో పాటు ఈసారి యూర‌ప్ లోనూ అంతే క్రేజీగా రాజ‌మౌళి త‌న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. యూఎస్ లో ఈ సినిమా ఘనంగా విడుదల కానుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. యూఎస్ తో పాటు యూరప్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతుందని యూకేతో పాటు 30 దేశాల్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. ఫోర్ సీజన్స్ క్రియేషన్స్ ఈ భారీ విడుదల వెనుక ప్లానింగ్ ని సాగిస్తున్నాయ‌ని స‌మాచారం.

పోలాండ్ - స్వీడన్ - ఫిన్లాండ్ వంటి కొన్ని దేశాల్లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో స్క్రీన్ లలో విడుదల కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే ప్రారంభమయ్యాయి.

ఏపీలో టిక్కెట్లపై 100 రూపాయల పెంపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏమ‌వుతుందోన‌న్న ఆందోళ‌న‌లో ఉన్న డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు చెవిలో అమృతం పోసే వార్త ఒక‌టి వైర‌ల్ అవుతోంది. RRR టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఇంత‌కుముందు రాజమౌళి- డీవీవీ దానయ్య కొద్దిరోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. తాజా గుస‌గుస ప్ర‌కారం.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆర్‌.ఆర్‌.ఆర్‌ టిక్కెట్‌ ధరలను 100 రూపాయల పెంపునకు అనుమతించినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి మంత్రి పేర్ని నాని చెబుతున్న వెర్ష‌న్ కి ఈ వెర్ష‌న్ కి ఏమాత్రం సింక్ కుద‌ర‌క‌పోయినా ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస ఇలా ఉంది. మారిన టిక్కెట్ ధరలకు అనుగుణంగా కొత్త జివోని ఏపీలో రూపొందించార‌ట‌. ఈ కొత్త ధరలు ఖచ్చితంగా RRR కలెక్షన్ లకు పెద్ద ఎత్తున సహాయపడతాయని అంచ‌నా.

రామ్ చ‌ర‌ణ్ - రామారావు- ఆలియా భట్- అజయ్ దేవగన్- శ్రియా శరణ్- ఒలివియా మోరిస్- సముద్రకని RRRలో తారాగ‌ణం. దీనికి MM కీరవాణి సంగీతం .. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.