Begin typing your search above and press return to search.
'RRR' మధుర స్మృతులు తారక్ మాటల్లో!
By: Tupaki Desk | 16 March 2022 9:36 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` మార్చి 25న రిలీజ్ అవుతోన్న సందర్భంగా చరణ్-తారక్ ద్వయం మళ్లీ మీడియాని రౌండప్ చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులగా ఇద్దరు ప్రచారం పనుల్లోనే నిమగ్నమయ్యారు. స్పెషల్ ఇంటర్వ్యూలు..ప్రెస్ మీట్లతో బిజీ బిజీగా గుడపుతున్నారు. ఈనేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నిర్వహించిన ఇంటర్వ్యూలో సినిమా గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
``సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడింది. అప్పటికే విపరీతమైన ప్రచారం చేసారు. వాయిదా పడిన సందర్భంలో ఏమనిపించింది అనగా? ``కష్టమంతా వృద్దా అయిందని బాధపడ్డా. కానీ ఎప్పుడు వచ్చినా..హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ కోల్పోలేదు. ఆన్ సెట్స్ లో ఏ అనుభవాన్ని మర్చిపోలేను. చరణ్..అలియాతో షూటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. గుర్తిండిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ షూటింగ్ ఒకటి ఉటుంది. అందుకోసం 60 రాత్రుళ్లు పనిచేసాం. ఆ షూట్ శారీరకంగా బాగా ఇబ్బంది పెట్టింది`` అన్నారు.
``కరోనాకి అంతగా భయపడలేదు. కానీ నన్ను బాగా ప్రభావితం చేసింది. కోవిడ్ కేసుల మధ్య కొంత షూటింగ్ చేసాం. అప్పుడు చాలా టెన్షన్ పడ్డాం. సినిమా కోసం ముందొస్తు రిహర్సల్స్ అంటూ ఏమీ లేవు. కానీ చరణ్-రాజమౌళి..తారక్ మధ్య మాత్రం చాలా సమావేశాలు జరిగాయి. జక్కన్న చెప్పినట్లు గుడ్డిగా చేసుకుంటూ వెళ్లిపోయాను. భీమ్ చాలా శక్తివంతమైన అమాయకంతో కూడిన పాత్ర. ఆ పాత్రని అందరూ ప్రేమిస్తారు. ఓపెన్ మైండ్ తో వెళ్లి ఆ పాత్రలో నటించాను. ఆ పాత్రకు సంబంధఙంచి సరైన రిఫరెన్స్ లు దొరకలేదు.
రాజమౌళితో కఠినమైన టాస్క్ మాస్టర్. నా నుంచి ఏదో కోరుకున్నారు. నా సామర్ధ్యం తెలిసిన ఏకైక దర్శకుడు కాబట్టి పని వీజీ అయింది. నా వంతు బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. అలియాభట్ ప్రతిభ సముద్రం లాంటింది. ఆమెను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఆమెతో కలిసి పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. ఇక రామ్ చరణ్ బెస్ట్ పెర్పార్మర్. అతను రామ్ గా మరో స్థాయిలో నటించాడు. అభిమానులు మెచ్చే పాత్ర అది. ఆయనతో రోజూ షూటింగ్ చాలా సరదాగా ఉండేది. ఇప్పుడు ఇద్దరం అన్నదమ్ముల్లా మెలుగుతున్నాం.
అభిమానులు హీరోలు కోసం పోరాడే రోజులు పోయాయి. ఈ సినిమా విషయంలో కేవలం పాత్రలు మాత్రమే గుర్తుకొస్తాయి. తారలెవరు? అన్న ఆలోచన లేకుండా సినిమా ఉంటుంది. ఇన్ని రోజులు గడుస్తున్నా జక్కన్న మాకు ఇంకా సినిమా చూపించలేదు. నాకు తెలిసి రెండు..మూడు రోజుల్లో చూపిస్తారనుకుంటున్నాం. సినిమా చూడటానికి చాలా ఉత్సాహం గా ఎదురుచూస్తున్నాను`` అని తారక్ తన `ఆర్ ఆర్ ఆర్` అనుభవాల్ని చెప్పుకొచ్చారు.