Begin typing your search above and press return to search.
ట్రిపుల్ ఆర్ పై షాకింగ్ కంప్లైంట్.. హర్ట్ అయ్యారట
By: Tupaki Desk | 26 March 2022 12:31 PM GMTయావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ట్రిపుల్ ఆర్. దాదాపు మూడున్నరేళ్లుగా ఈ మూవీ కోసం చిత్ర బృందంతో పాటు ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎప్పుడెప్పుడు ఈ భారీ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుందా? .. ఎప్పుడెప్పుడు చూసేయాలా అని యమ క్రేజీగా ప్లాన్ లు చేసుకున్నారు. కొంత మంది అభిమానులు 5 వేల వరకు అయినా సరే టికెట్ కి ఖర్చు పెట్టి సినిమా చూడాల్సిందే అని రెడీ అయిపోయారు. చాలా మంది పెట్టేశారు కూడా.
అంతా ఎదురుచూసిన సమయం రానే వచ్చేసింది. ట్రిపుల్ ఆర్ ఎట్టకేలకు మార్చి 25న శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. ప్రీమియర్ షోల నుంచే రికార్డుల మోత మొదలుపెట్టిన ఈ మూవీ రిలీజ్ ఫస్ట్ డే ఫస్ట్ షోతో యునానిమస్ టాక్ తో వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తోంది. సామాన్యులు, అభిమానులు, సినీ లవర్స్ సినిమాపై, రాజమౌళి అండ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజమౌళి టాలీవుడ్ కు దక్కిన వరం అంటూ జేజేలు పలుకుతూ ట్రిపుల్ ఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు.
కొంత మంది క్రిటిక్స్ ఇప్పటికే సినిమాని, రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసి ఇండియన్ సినీ హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదని, రాజమౌళి మరోసారి అద్భుతం చేశారని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ట్రిపుల్ ఆర్ పై షాకింగ్ కంప్లైంట్ చేస్తూ ఈ విషయంలో తామంతా హర్ట్ అయ్యామంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ ల వర్షం కురిపిస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతూ గత రికార్డులని తిరగరాస్తూ సినిమా సంచలనం సృష్టిస్తున్న వేళ ఈ మూవీకి సంబంధించిన ఓ విషయంలో ప్రేక్షకులు, అభిమానులు హర్ట్ అయ్యామంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ అంశాన్ని ప్రసావిస్తున్నారు.
ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే ట్రిపుల్ ఆర్ లో రొమాంటిక్ సీన్స్, రొమాన్స్ లేదని అట. దీని పై సోషల్ మీడియా వేదిక్గా మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సినిమాల్లో సహజంగా యాక్షన్ కు ఎంత ప్రాధాన్యత వుంటుందో రొమాంటిక్ సన్నివేశాలకు కూడా అంతే ప్రాధాన్యత వుంటుంది, విక్రమార్కుడు చిత్రంలో రవితేజ - అనుష్కల మధ్య వచ్చే నడుము సీన్, బాహుబలి తో ప్రభాస్ - అనుష్కల లిప్ లాక్, ప్రభాస్ - తమన్నాల మధ్య సాగిన రొమాంటిక్ సాంగ్ ఆయా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అయితే అదే ట్రినుల్ ఆర్ లో ఇప్పుడు మిస్సవ్వడం అబిమానుల్ని హర్ట్ చేసిందట. సినిమా కథ సీరియస్ గా సాగేది కావడం, మధ్య లో రొమాన్స్ స్పీడు బ్రేకర్స్గా మారే అవకాశం వుండటంతో రాజమౌళి ఆవైపుగా ఆలోచించలేదని చెబుతున్నారు. అయితే ఇలాంటి సినిమాలో బ్రోమాన్స్ తప్ప రొమాన్స్ లేదని ఫ్యాన్స్ నెట్టింట ఈ టాపిక్ ని వైరల్ చేయడంతో ప్రస్తుతం ఇది ట్రెండింగ్ గా మారింది. కొంత మంది పనిగట్టుకుని విమర్ళలు చేసేవాళ్లు రొమాన్స్ లేదని చెప్పడంతో ఫ్యాన్స్ ఈ విషయాన్ని పట్టుకుని నెట్టింట వైరల్ చేస్తుండటం గమనార్హం.