Begin typing your search above and press return to search.

త‌గ్గేదే లే అంటున్న శ్రీ‌లీల‌..వ‌రించిన మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌!?

By:  Tupaki Desk   |   18 March 2022 5:32 AM GMT
త‌గ్గేదే లే అంటున్న శ్రీ‌లీల‌..వ‌రించిన మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌!?
X
యంగ్ బ్యూటీ శ్రీ‌లీల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రోషన్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెర‌కెక్కిన `పెళ్లిసంద‌D` మూవీతో ఈ క‌న్న‌డ భామ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయినా.. మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన శ్రీ‌లీల మైమ‌ర‌పించే అందం, చ‌లాకీత‌నంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

పెళ్లిసంద‌D త‌ర్వాత శ్రీ‌లీల వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ త‌గ్గేదే లే అన్న చందంగా దూసుకుపోతోంది. ఈమె న‌టిస్తున్న రెండో చిత్రం `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ర‌వితేజ హీరోగా న‌టిస్తున్నాడు. స్పెయిన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ధ‌మాకాతో పాటు శ్రీ‌లీల మెగా మేన‌ల్లుడు వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా, నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేసేందుకు సైన్ చేసింద‌ట‌. అలాగే మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రంలోనూ ఈమె సెకెండ్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌నే టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. శ్రీ‌లీల‌ను మ‌రో క్రేజీ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌ముఖ రైటర్ క‌మ్ డైరెక్ట‌ర్‌ వక్కంతం వంశీ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` ఫ్లాప్ త‌ర్వాత మెగా ఫోన్ ప‌ట్టలేదు. అయితే ఈయ‌న ఇప్పుడు యంగ్ హీరో నితిన్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు గ‌త కొద్ది రోజుల నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయిందని.. ఈ మూవీకి `జూనియ‌ర్‌` అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నార‌ని అంటున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీ‌లీల‌ను తీసుకోవ‌డం కోసం.. ఇటీవ‌లె ఆమెను సంప్ర‌దించార‌ట‌. త‌న పాత్ర‌కు మంచి స్కోప్ ఉండ‌టంతో శ్రీ‌లీల వెంట‌నే ఓకే చెప్పింద‌ని టాక్ న‌డుస్తోంది. కాగా, నితిన్ ప్ర‌స్తుతం `మాచర్ల నియోజకవర్గం` అనే సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తైన వెంట‌నే వక్కంతం వంశీ మూవీని ప‌ట్టాలెక్కించే అవ‌కాశాలు ఉన్నాయి.