Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : లంగాఓణి లో నడుము అందంతో పిచ్చెక్కిస్తుంది

By:  Tupaki Desk   |   16 March 2022 1:30 AM GMT
ఫోటోటాక్ : లంగాఓణి లో నడుము అందంతో పిచ్చెక్కిస్తుంది
X
తెలుగు ప్రేక్షకులకు పెళ్లిసందD అనే సినిమా తో శ్రీలీలా ను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పరిచయం చేశారు. సినిమా ప్లాప్ అయినా కూడా ఆయన సెలక్షన్‌ ప్లాప్ కాలేదు. ఇండస్ట్రీకి ఆయన మరో అందగత్తెను పరిచయం చేశాడు. అందంతో పాటు ఎక్స్‌ ప్రెషన్స్‌ అద్బుతంగా ఇవ్వగలదు అంటూ శ్రీలీల పై కామెంట్స్ వస్తున్నాయి. మొదటి సినిమా లో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ తో రొమాన్స్ చేసిన శ్రీలీలా కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది.

ఆ సినిమా ఫలితంతో పట్టింపు లేకుండా శ్రీలీల పేరు మారు మ్రోగిపోయింది. ఇంత అందగత్తెను దర్శకేంద్రుడు ఎక్కడ పట్టాడ్రా బాబు అంటూ సినీ ప్రేమికులు మరియు యూత్‌ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఈ అమ్మడు ఏ కాస్ట్యూమ్స్ లో అయినా అందంగా కనిపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా అబ్బుర పర్చుతుంది. ఆడవారికి కూడా అబ్బ ఎంత బాగుంది అనిపించేంత అందం ఈమెది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాంటి అందగత్తె ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. సీనియర్‌ హీరో రవితేజ మొదలుకుని బ్యాక్ టు బ్యాక్ యంగ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలను కమిట్‌ అవుతోంది. ఈమె జోరు చూస్తుంటే అతి త్వరలోనే యంగ్‌ స్టార్‌ హీరోలకు కూడా ఈమె జోడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్‌ గా ఈ అమ్మడు తన అందాలతో సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను ఎంటర్‌ టైన్ చేస్తూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడి పింక్‌ లంగా ఓణి లుక్ కుర్ర కారు మతి పోగొడుతోంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. సైడ్ యాంగిల్ లో లంగా ఓణి లో నడుము చూపించి చూపించకుండా చూపిస్తూ నాభి అందాలను దాస్తున్నట్లుగా వ్యవహరిస్తూ ఈ అమ్మడు ఇచ్చిన ఫోటో స్టిల్‌ యూత్‌ పిచ్చెక్కి పోతున్నారు. అందమైన ఈ అమ్మడి అందంకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.

శ్రీ లీలా తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా ఆఫర్లను దక్కించుకుంటూ ఉంది. అయితే ఈమె ప్రథమ ప్రియారీటీ మాత్రం తెలుగు సినిమాలు అంటోంది. ఇతర భాషల్లో స్టార్‌ హీరోలతో నటించే ఆఫర్లు వస్తేనే చేస్తారంటోంది. తెలుగు లో కూడా ఈమె స్టార్‌ హీరోల సినిమాల కోసం ఎదురు చూస్తుంది. మెల్ల మెల్లగా టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ గా ఎదగడం ఖాయం అనిపిస్తుంది.