Begin typing your search above and press return to search.
మహేష్-జక్కన్న ప్రాజెక్ట్ పై స్టార్ రైటర్ అప్ డేట్!
By: Tupaki Desk | 24 March 2022 6:38 AM GMTసూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా స్టార్ మేకర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఆఫ్రికన్ ఆడవుల నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కించనున్నారు. ఈ కాంబినేషన్ ప్రకటనతోనే అంచనాలు ఆకాశాన్నంటడం మొదలైంది. ప్రభాస్ తర్వాత రాజమౌళికి తగ్గ సరైన పాన్ ఇండియా స్టార్ మహేష్ మాత్రమేనని ఓవైపు టాక్ నడుస్తోంది.
మహేష్ లాంటి స్టార్ రాజమౌళి లాంటి మేకర్ చేతిలో పడితే ఆ కాంబినేషన్ ఊహకే అందని విధంగా ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ ఇందులో కొన్నిఅంశాలు ఓ రకమైన ప్రచారం మాత్రమే. ముఖ్యంగా కథ పై సహజంగానే రూమర్లు తెరపైకి వస్తుంటాయి. అలాంటి రూమరే ఆప్రికన్ స్టోరీ అనేదని నిర్ధారించలేని పరిస్థితి ఉంది.
ఇటీవలే ఓ సమావేశంలో `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెడతానని ఇప్పటికే రాజమౌళి ఓ సందర్భంలో అన్నారు. తాజాగా రచయిత విజేంద్ర ప్రసాద్ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించారు. అన్ని రకాల ప్రచారాలకు స్టార్ మేకర్ తెర దించేసారు. ఆయన మాటల్ని బట్టి మహేష్ తో సినిమా పాన్ ఇండియాని మించే ఉంటుందా? అన్న సందేహం రాక మానదు.
``అవును ..నేను నిజంగానే మహేష్ కోసం ఆప్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ స్టోరీ సిద్దం చేస్తున్నాను. ప్రస్తుతం ఆ కథ రన్నింగ్ లో ఉంది. రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అయితే ఫ్రీ అవుతాడు. ఆ తర్వాత ఇద్దరం స్ర్కిప్ట్ పై డిస్కస్ చేస్తాం. మా ఇద్దరి నిర్ణయాల్ని బట్టి కథ స్వరూపం ఆధారపడి ఉంటుంది. కానీ ఆప్రికన్ అడవుల నేపథ్యం అన్నది ఖారైనట్లేనని`` తెలిపారు.
అలాగే భారీ స్థాయిలోనే సినిమా నిర్మాణం ఉంటుందని హింట్ ఇచ్చారు. దీన్ని బట్టి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయాలి. ఫారెస్ట్ నేపథ్యంలో సినిమా రావడం అన్నది ఇండియన్ స్ర్కీన్ పై ఇదే మొదటిసారి. బాలీవుడ్ మేకర్స్ సైతం ఇప్పటివరకూ ఇలాంటి సాహసానికి పూనుకోలేదు. ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కే సినిమా టెక్నికల్ గానూ హై స్టాండర్స్డ్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఓ వైపు బలమైన కథని నడుపుతూనే మరోవైపు విజువల్ గానూ హైలైట్ చేయడం జక్కన్న ప్రత్యేకత. ఆ రకంగా సాంకేతికంగాను సినిమా ప్రత్యేకతని చాటుకుంటుంది. పాన్ ఇండియా లో సినిమా రిలీజ్ దాదాపు ఖరారైనట్లే. యూనివర్శల్ స్ర్కిప్ట్ కాబట్టి అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటు.. హిందీ లేదా తమిళ్ ల్లోనూ తెరకెక్కించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి నిర్మాత ఎవరు? అన్న వివరాలు మాత్రం ఇంకా లీక్ అవ్వలేదు.