Begin typing your search above and press return to search.
ఏప్రిల్ లో బాక్సాఫీస్ సమరం.. వీటిమధ్యే పోటీ!
By: Tupaki Desk | 1 April 2022 2:31 PM GMTఓ పక్క ఎండల వేడితో సమ్మర్ హీటెక్కుతోంది. అయితే వినోదంతో కూల్ చేసేస్తాం అంటూ సినిమాలు ఏప్రిల్ లో సమరానికి సై అంటున్నాయి. చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా మూవీస్ వరకు దాదాపుగా 8 చిత్రాలు ఈ నెలలో బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి. తాప్సీ `మిషన్ ఇంపాజిబుల్` నుంచి మెగా స్టార్ `ఆచార్య` .. అలాగే పాన్ ఇండియా మూవీ `కేజీఎఫ్ చాప్టర్ 2` వరకు బిగ్ మూవీస్ పోటీకి దిగుతున్నాయి. ఇందులో క్రేజీ చిత్రాల సత్తా ఏంటో .. చిన్న సినిమాల స్పెషాలిటీ ఏంటో చూద్దాం.
దాదాపు ఆరేళ్ల విరామం తరువాత తాప్సీ తెలుగులో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. స్వరూప్ ఆర్ ఎస్ జె డైరెక్షన్ లో మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కామెడీ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న శుక్రవారం విడుదలైంది. ఈ మూవీతో ఏప్రిల్ సమ్మర్ సమరం మొదలైంది. తాప్సీ ఆరేళ్ల తరువాత తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.
ఈ మూవీ రిలీజ్ అయిన సరిగ్గా వారం తరువాత అంటే ఏప్రిల్ 8న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ `గని` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నఈ మూవీతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాతగా పరిచయం అవుతున్నారు. అంతే కాకుండా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈమూవీలో ఇద్దరు స్టార్స్ ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. దీంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ మూవీ రిలీజ్ తరువాత వారం గ్యాప్ తో ఏప్రిల్ 13న విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ `బీస్ట్` రిలీజ్ కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో దర్శకుడు సెల్వరాఘవన్ విలన్ గా పరిచయం అవుతున్నారు. `మాస్టర్` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలున్నాయి.
ఈ మూవీ విడుదలైన ఒక్క నెక్స్ట్ డే అంటే ఏప్రిల్ 14న దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న `కేజీఎఫ్ చాప్టర్ 2` రిలీజ్ అవుతోంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈచిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోసం దాదాపు ఏడాదిన్నరగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఆ రోజు రాబోతోంది. ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించడం, సెకండ్ పార్ట్ లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించడంతో ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తున్న సమయంలో రెండు చిన్న చిత్రాలు రిలీజ్ కు రెడీ అయిపోతున్నాయి. ఏప్రిల్ 22న విడుదల కానున్న ఈ రెండు చిత్రాల్లోని ఓ మూవీ `జయమ్మ పంచాయితీ`. ఇందులో పాపులర్ యాంకర్ సుమ టైటిల్ పాత్రలో నటించింది.దీంతో ఈ మూవీపై క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ మూవీతో పాటే నాగశౌర్య నటించిన `కృష్ణ వ్రిందా విహారి` రిలీజ్ అవుతోంది. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్య ఈ మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. అంతే కాకుండా దీన్ని సొంతం నిర్మాణ సంస్థపై నిర్మించాడు. ఎలా చూసినా ఈ మూవీ సక్సెస్ నాగశౌర్యకు చాలా అవసరం.
ఇక ఇదే రోజు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా బరిలో దిగుతున్నాడు. తను నటించిన తాజా చిత్రం `అశోకవనంలో అర్జున కల్యాణం`. విద్యాసాగర్ చింత డైరెక్ట్ చేసిన ఈ మూవీ తొలి నుంచి ఇదొక విభిన్నమైన సినిమా అనే ఫీలింగ్ ని కలిగిస్తూ వస్తోంది. టీజర్, ట్రైలర్ విశ్వక్ సేన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా వుండటంతో ఈ మూవీపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. `పాగల్` ఫ్లాప్ తో రేస్ లో వెనకబడిన విశ్వక్ కు ఇది హిట్ కావడం చాలా అవసరం.
ఈ మూవీ రిలీజ్ అయిన వారం తరువాత బాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన `ఆచార్య` చిత్రం ఏప్రిల్ 29న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తొలి సారి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం కాయం అని అభిమానులు ధీమాగా వున్నారు. ఇలా ఏప్రిల్ 1 నుంచి 29 వరకు బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలు, క్రేజీ మూవీస్, పాన్ ఇండియా సినిమాలు మొత్తం 8 పోటీపడుతున్నాయి.