Begin typing your search above and press return to search.
మొత్తానికి 'కశ్మీర్ ఫైల్స్' వివాదానికి తెరదించేశాడే!
By: Tupaki Desk | 16 March 2022 12:30 AM GMTకొన్ని సినిమాలు చూసినప్పుడు వాస్తవ సంఘటనలకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. మరికొన్ని సినిమాలు వాస్తవ సంఘటనలలో నుంచే పుడతాయి. ఒక కథ కల్పనలో నుంచి పుడితే .. ఆ కథను సినిమాగా చేస్తున్నప్పుడు ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకావు. కానీ అదే కథను వాస్తవంలో నుంచి తీసుకుంటున్నప్పుడు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అలాంటివాటిని స్వీకరించడానికి సిద్ధపడే రంగంలోకి దిగవలసి ఉంటుంది.
అలా ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమానే 'కశ్మీర్ పైల్స్'. అనుపమ్ ఖేర్ .. మిథున్ చక్రవర్తి .. పల్లవి జోషి ప్రధానమైన పాత్రలను పోషించారు.
తేజ్ నారాయణ్ అగర్వాల్ - అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాలో, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి - పల్లవి జోషి కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదలైంది. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది చాలా చిన్న సినిమా. కానీ ఇప్పుడు ఈ సినిమాను చూడటానికి ముంబై లోని థియేటర్స్ సరిపోవడం లేదు. అందువల్లనే థియేటర్స్ సంఖ్య పెంచుకుంటూ వెళుతున్నారు. ఒక వైపున 'రాధేశ్యామ్' భారీస్థాయిలో థియేటర్లను ఆక్రమించగా, ఆ థియేటర్లను తన స్వాధీనంలోకి తీసుకుంటున్న సినిమాగా 'కశ్మీర్ ఫైల్స్ కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 'కపిల్ శర్మ'ను అడిగితే, ఆయన తన టాక్ షోలో ఈ సినిమా టీమ్ ఎంట్రీకి ఒప్పుకోలేదని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి విమర్శించాడు. ఆయన అలా నో చెప్పడానికి కారణం తమ సినిమాలో స్టార్స్ ఎవరూ లేకపోవడమేనని ఆరోపించాడు. దాంతో ఇంతమంచి సామాజిక సందేశం కలిగిన సినిమా ప్రమోషన్స్ కి సహకరించారా? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాన్రాను ఈ గొడవ పెద్దదవుతూ వెళుతుండటంతో అనుపమ్ ఖేర్ జోక్యం చేసుకున్నారు.
కపిల్ శర్మ టాక్ షోలో 'కశ్మీర్ ఫైల్స్' సినిమా టీమ్ కనిపించకపోవడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కోసం తనని కపిల్ శర్మ ఆహ్వానించారని అన్నారు. అయితే ఈ సినిమాలో టచ్ చేసిన పాయింట్ చాలా సున్నితమైనది. అలాంటి విషయాలను ఇలాంటి వేదికలపై మాట్లాడటం కరెక్ట్ కాదు. పైగా సినిమా చాలా సీరియస్ గా సాగుతుంది .. దాని గురించి కామెడీ షోలో మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అందువల్లనే తాను వెళ్లలేదని చెబుతూ ఈ వివాదానికి తెరదించేశారు.