Begin typing your search above and press return to search.

ముగ్గురు క్రేజీ ప్రొడ్యూస‌ర్ల చేతికి విజ‌య్ `బీస్ట్‌`

By:  Tupaki Desk   |   22 March 2022 4:30 PM GMT
ముగ్గురు క్రేజీ ప్రొడ్యూస‌ర్ల చేతికి విజ‌య్ `బీస్ట్‌`
X
త‌మిళ స్టార్‌ హీరో విజ‌య్ చిత్రాల‌కు తెలుగులో పెద్ద‌గా మార్కెట్ వుండేది కాదు. అయితే టైమ్ మారింది. అత‌ని చిత్రాల‌కు టాలీవుడ్ లో ఆద‌ర‌ణ మొద‌లైంది. ఇటీవ‌ల విడుద‌లైన పోలీసోడు (థేరి), అదిరింది (మెర్స‌ల్), మాస్ట‌ర్ చిత్రాల‌కు తెలుగులో మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇందులో గ‌త ఏడాది విడుద‌లైన `మాస్ట‌ర్‌` చిత్రం మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు థియేట్రిక‌ల్ రైట్స్ కోసం పోటీ ఏర్ప‌డింది. అయితే ఫైన‌ల్ గా 6 కోట్ల‌కు మ‌హేష్ కోనేరు సొంతం చేసుకుని భారీ స్థాయిలో రిలీజ్ చేశాడు.

బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న `మాస్ట‌ర్` తెలుగులో 14 కోట్లు వ‌సూలు చేసి ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీంతో విజ‌య్ న‌టిస్తున్న తాజా చిత్రం `బీస్ట్` పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేశారు. ప్ర‌తిష్టాత్మ‌క స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మార‌న్ ఈ మూవీని భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లై `అర‌బ్బిక్కూతు...` లిరిక‌ల్ వీడియోకు రికార్డు స్థాయి స్పంద‌న ల‌భించింది.

తాజాగా మ‌రో లిరిక‌ల్ వీడియోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇది కూడా ఇప్పుడు నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ మూవీని కూడా త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌వ‌డంతో చిత్ర బృందం ఈ మూవీ రిలీజ్ డేట్ ని మంగ‌ళారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 13న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర తెలుగు థియేట్రిక‌ల్ రైట్స్ కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది.

ఈ చిత్ర తెలుగు హ‌క్కుల్ని ముగ్గురు స్టార్ ప్రొడ్యూస‌ర్ లు సొంతం చేసుకున్నారు. వారే దిల్ రాజు, డి. సురేష్ బాబు, ఏషియ‌న్ సునీల్‌. ఈ ముగ్గురు క‌లిసి ఈ చిత్ర తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కుల్ని భారీ మొత్తానికి సొంతం చేసుకున్నార‌ట‌. `బీస్ట్` తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కుల కోసం ఈ ముగ్గురు నిర్మాత‌లు 11 కోట్లు చెల్లించార‌ట‌. `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` కి స‌రిగ్గా ఒక్క రోజు ముందు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. అప్ప‌టికి `ఆర్ ఆర్ ఆర్‌` క్రేజ్ త‌గ్గుతుంది కాబ‌ట్టి ఆ టైమ్ ని `బీస్ట్‌`కి వాడుకోవ‌చ్చ‌ని భావిస్తున్నార‌ట‌.