Begin typing your search above and press return to search.

రెండేళ్ల తర్వాత రౌడీ మారిండోచ్

By:  Tupaki Desk   |   28 Feb 2022 5:30 PM GMT
రెండేళ్ల తర్వాత రౌడీ మారిండోచ్
X
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. కరోనా కు ముందు లైగర్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు సాగుతూ వచ్చింది. సినిమా కోసం గడ్డం మరియు జుట్టు భారీగా పెంచిన విజయ్ దేవరకొండ షూటింగ్‌ పూర్తి అవ్వడంతో ఎట్టకేలకు తన జుట్టును ట్రిమ్‌ చేశాడు. గడ్డం కూడా చాలా తగ్గించాడు. రెండేళ్లుగా విజయ్ దేవరకొండను ఆ లుక్ లో చూసి ఇప్పుడు కొత్త లుక్ లో కనిపించే వరకు అభిమానులు షాక్ అవుతున్నారు.

లైగర్ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యిందని ప్రకటించిన సమయంలోనే విజయ్ దేవరకొండ కొత్త లుక్ లో మన ముందుకు రాబోతున్నాడు అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే తాజాగా జరిగిన ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌ లో ఈయన పాల్గొన్నాడు. క్యాప్ పెట్టుకుని ట్రెండీ లుక్ లో రౌడీ స్టార్‌ కనిపించాడు. ఎప్పటిలాగే తన అభిమానులను ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ను తన లుక్ తో ఫిదా చేసి పడేశాడు.

అందమైన తన హెయిర్‌ స్టైల్‌ ను తొలగించాడంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు ఎగ్గకేలకు ఆ గద్ద గూడు వంటి జుట్టు ను కట్‌ చేసి విజయ్ దేవరకొండ మళ్లీ క్యూట్‌ గా కనిపిస్తున్నాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఎలాంటి లుక్ లో అయినా కూడా ట్రెండీగా ముఖ్యంగా అమ్మాయిల గుండెల్లో గుబులు రేపే విధంగా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ కొత్త లుక్ ఏ సినిమా కోసం అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే పూరి జగన్నాధ్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన జనగనమణ సినిమాను ప్రకటించాడు. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు. పూరి సినిమాను మొదట విజయ్ దేవరకొండ మొదలు పెట్టేనా లేదంటే శివ నిర్వాన దర్శకత్వంలో సినిమాను విజయ్ దేవరకొండ షురూ చేస్తాడా అనేది చూడాలి.

విజయ్‌ దేవరకొండ క్లీన్‌ అండ్ గుడ్‌ లుకింగ్‌ ను చూస్తుంటే ఆయన తదుపరి సినిమా శివ నిర్వాన దర్శకత్వంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ నిర్వాన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల్లో ఎక్కువ శాతం హీరోలు చాలా నీట్‌ గా డీసెంట్‌ గా కనిపిస్తారు.

కనుక విజయ్ లుక్‌ ను చూస్తుంటే తదుపరి సినిమా శివ నిర్వాన దర్శకత్వంలోనే ఉండేలా అనిపిస్తుంది. పూరి సినిమా లో హీరో అంటే రఫ్‌ అండ్‌ టఫ్ అన్నట్లుగా ఉంటాడు. కనుక విజయ్ లుక్ ఆయన తదుపరి సినిమా విషయంలో కాస్త గందరగోళంను క్రియేట్‌ చేస్తోంది.