Begin typing your search above and press return to search.
భలే ప్రస్థానం భళ్లాలదేవ!
By: Tupaki Desk | 19 Feb 2022 11:32 AM GMTటాలీవుడ్ లో సురేశ్ ప్రొడక్షన్స్ కి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఒకప్పుడు మాత్రమే కాదు ఇప్పుడు కూడా ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలో ఒక చిన్న వేషం వచ్చినా చాలు అనుకునే ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా రామానాయుడు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. ఎంతోమంది నటీనటులు .. సాంకేతిక నిపుణులు .. రచయితలు ఈ సంస్థ ద్వారా పరిచయమయ్యారు. ఇక సురేశ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పేరును పోస్టర్స్ పై చూసి థియేటర్స్ కి వెళ్లేవారున్నారు. అంతగా ఆడియన్స్ వైపు నుంచి కూడా ఈ సంస్థ నమ్మకాన్ని సంపాదించుకుంది.
అలాంటి రామానాయుడి వారసుడిగా సురేశ్ బాబు కూడా నిర్మాణ వ్యవహారాలను చక్కబెడుతూ వస్తున్నారు. ఆయన తనయుడిగా రానా కూడా ముందుగా స్టూడియో వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు. ఊహతెలిసిన దగ్గర నుంచి సినిమా వాతావరణాన్ని చూసిన ఆయన, ఎప్పుడూ ఏ సినిమాలో కూడా వేషాలు వేసే ఆలోచన చేయకపోవడం విశేషం. తాను కూడా తెరపైకి రావాలని అనుకున్నది .. ఆచరణలో పెట్టింది 'లీడర్' సినిమాతోనే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమా 12 ఏళ్ల క్రితం ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అంటే నటుడిగా రానా తన ప్రయాణాన్ని ప్రారంభించి పుష్కరకాలం పూర్తయిందన్నమాట. రానా హీరోగా ముందుకు వెళ్లాలని ఆ దిశగా కొన్ని సినిమానాలు చేశారు. కానీ ఆ సినిమాలేవీ ఆయన కెరియర్ కి హెల్ప్ కాలేకపోయాయి. దాంతో ఆయన కీలకమైన పాత్రలు చేయడానికి .. అతిథి పాత్రల్లో మెరవడానికి కూడా సిద్ధపడ్డారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను నటుడిగా ముందుకు వెళ్లారు. అక్కడి ప్రేక్షకులకు అలా ఆయన టచ్ లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే 'బాహుబలి'లో విలన్ రోల్ తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
రానాకి యాక్టింగ్ పెద్దగా రాదు అనే ఒక విమర్శ అప్పటివరకూ వినిపిస్తూ ఉండేది. ఈ సినిమా చూసిన తరువాత రానాలో మంచి నటుడు ఉన్నాడనే విషయం వాళ్లకి అర్థమైంది. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ కి ఎంత క్రేజ్ వచ్చిందో .. విలన్ గా రానాకి అంతే క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి రానా క్రేజ్ అపజయాలకు అతీతంగా వెళ్లింది. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ఆయన కెరియర్ కి మరో సూపర్ హిట్ ను ఇచ్చింది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటే రానా ఒక రేంజ్ లో విజృంభిస్తాడనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది.
ఆ మధ్య ఆయన తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యారు .. అయినా ఆత్మవిశ్వాసంతో దాని బారి నుంచి బయటపడ్డారు. ఒక వైపున బుల్లితెరపై హోస్ట్ గా మెప్పించిన ఆయన, మరో వైపున వెంకటేశ్ తో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'వెంకీ బాబాయ్' అనే సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన తాజా చిత్రమైన 'భీమ్లా నాయక్' ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. 'విరాటపర్వం' కూడా విడుదలకి సిద్ధంగానే ఉంది.
ఈ 12 ఏళ్ల ప్రయాణంలో అన్ని రకాల అవకాశాలు ఉండికూడా తనని తాను మలచుకోవడానికి .. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి ఆవేశంతో ఆయన వేసే అడుగుల చప్పుడు వినిపిస్తుంది! తనని తాను నిరూపించుకోవాలనే ఆశయమే అణువణువునా ఆయనలో కనిపిస్తుంది!!