Begin typing your search above and press return to search.
సురేష్ బాబు తగ్గేదేలే అంటున్నారా?
By: Tupaki Desk | 21 Feb 2022 3:29 AM GMTసురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నిర్మాతగా చాలా సెలక్టివ్ గా సినిమాలు నిర్మిస్తుంటారు. కాంబినేషన్ కంటే కంటెంట్ ని నమ్మి సినిమాలు చేసే నిర్మాతల్లో సురేష్ బాబుది ప్రత్యేకమైన స్థానం. గడిచిన మూడు నాలుగేళ్లగా సురేష్ బాబు సినిమాల గ్రాప్ పరిశీలిస్తే తన ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు నిర్మించినట్లు కనిపిస్తోంది. కోవిడ్ మొదలైన తర్వాత ఆ వేగం కూడా తగ్గింది. వెంకటేష్ హీరోగా నటించిన `నారప్ప`..`దృశ్యం-2` చిత్రాల్ని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేసారు.
థియేటర్లో రిలీజ్ చేయాలని ఒత్తిడి ఎదురైనప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా భవిష్యత్ సినిమా ఓటీటీదే అని ముందుకెళ్లిపోయారు. అటుపై ఏపీలో టిక్కెల్ ధరలు తగ్గడం.. టాలీవుడ్ ధపధపాలుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి..మంత్రుల బృందంతో చర్చలు జరపడం వంటి పరిణామాల్ని సురేష్ బాబు ఓవైపు వాచ్ చేస్తూనే ఉన్నారు. ఈ భేటీల కు తొలి నుంచి సురేష్ బాబు దూరంగానే ఉన్నారు. వివాదం మొదలైన సమయంలో కల్పించుకున్నారు తప్పితే..అవి ముదిరే పరిస్థితిలో ఆయన పూర్తిగా దూరమయ్యారు.
ఆ మధ్య డిస్ర్టిబ్యూటర్లు ఆందోళన చేసినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. మరి ఇలాంటి సన్నివేశాలు సురేష్ బాబు ఆలోచనలో మార్పులు తీసుకొచ్చాయా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. నిర్మాతగా సుదీర్ఘ ప్రస్థానం ఆయనది. దాదాపు మూడు దశాబ్ధాలుగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఎంతో మంది హీరోలు..నిర్మాతలతో పనిచేసిన అనుభవం ఉంది.
ఇక రాజకీయంగా సురేష్ బాబు..వెంకటేష్ ఏనాడు భాగమైంది లేదు. పరోక్షంగా ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వాలి తప్పితే ప్రత్యక్ష మద్దతు ఏనాడు లేదు. ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకున్న పరిస్థితులు...ఇండస్ర్టీలో ముసురుకుంటోన్న వివాదాలు వాచ్ చేస్తోన్న సురేష్ బాబు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనుకున్నారో ఏమో! గానీ ఫిలిం ఛాంబర్ మీటింగ్ లు పెడుతున్నా...చిరంజీవి లాంటి ఉద్దండులు సీఎంని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా సురేష్ బాబు మాత్రం తగ్గేదేలే అంటూ తనపని తాను చూసుకుంటున్నారు.
సురేష్ బాబు వైఖరి చూస్తుంటే ప్రభుత్వం మారే వరకూ ఆయన సినిమాలు కూడా నిర్మించేలా కనిపించడం లేదని ఫిలిం సర్కిల్స్ లో సైతం గుస గుస వినిపిస్తోంది. ఆయనది ఒకరి దగ్గర తగ్గే మనస్తత్వం కాదని అంటున్నారు. ఓటీటీ భవిష్యత్ ని ముందే అంచనా వేసిన సురేష్ బాబు ఓటీటీ వరల్డ్ టాలీవుడ్ లో లాంచ్ అయిన తర్వాతే సినిమా భవిష్యత్ ఓటీటీదే అని ఉద్ఘాంటించిన మొట్ట మొదటి నిర్మాత సురేష్ బాబునే.
టెక్నాలజీ పరంగా సురేష్ బాబు అప్ డేట్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందింపుచ్చుకోవాలని సహచరులకు చెబుతుంటారు. ఉన్న థియేటర్లు ఫంక్షన్ హాల్స్ గా మారుతోన్న తరుణంలో సురేష్ బాబు పూర్తిగా ఓటీటీ వైపు తమ సినిమాల్ని రిలీజ్ చేసే అవకాశం ఉందని తాజా సన్నివేశాల్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం సురేష్ బాబు ఓ కోరియన్ చిత్రాన్ని సుదీర్ వర్మ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. `శాకిని దాకిణి` టైటిల్ తో రీమేక్ అవుతుంది. కానీ సినిమా అప్ డేట్స్ మాత్రం లేవు.