Begin typing your search above and press return to search.
కీరవాణిగారూ నాకు ఆ పాట నచ్చలేదంతే: ఎన్టీఆర్
By: Tupaki Desk | 22 March 2022 2:30 PM GMTటాలీవుడ్ సంగీత దర్శకులలో కీరవాణి స్థానం ప్రత్యేకం. ఆయన పాటలు సున్నితంగా .. సుకుమారంగా అనిపిస్తాయి. అవి ఆనందంతో ఆకాశమే హద్దుగా విహరింపజేస్తాయి. అనుభూతుల అమృతాన్ని అందించడం .. ఓడిపోయిన మనసుకు ఓదార్పును ఇవ్వడం ఆయన పాటలకు బాగా తెలుసు.
హృద్యమైన మెలోడీ సాంగ్స్ ను ఆయన ఎంత బాగా ట్యూన్ చేస్తారో, కళ్లెం తెంచుకున్న గుర్రం మాదిరిగా పరిగెత్తే హుషారైన పాటలను కూడా ఆయన అంతే అద్భుతంగా ఆవిష్కరిస్తారు. అలాంటి కీరవాణి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పుంజుకున్నాయి. ఆ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ - చరణ్ లతో కీరవాణి చిట్ చాట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ .. "సాధారణంగా నేను ట్యూన్ చేసిన పాటల్లో మీకు ఏ పాటలు ఇష్టమని ఎవరిని అడిగినా, 'తెలుసా మనసా' .. 'మా పెరటి జామ్ చెట్టు' పాటలు చెబుతుంటారు.
అలా కాకుండా మీరు హానెస్టుగా చెప్పండి .. నేను ఇంతవరకూ చేసిన పాటల్లో మీకు నచ్చని పాట .. ఇంత దరిద్రంగా చేశారేంటి కీరవాణి గారు అనుకునే ఒక సాంగ్ చెప్పండి" అని అడిగారు.
అప్పుడు ఎన్టీఆర్ స్పందిస్తూ .. "నిజంగానే నాకు 'భీమవరం బుల్లోడా పాలు కావాలా' అనే పాట నచ్చదు. లిరిక్స్ నచ్చకపోవడం వల్లనేమో తెలియదు గానీ, ఆ పాట ఇష్టం ఉండదు. ఆ పాటలో 'జింకు చకుం' అనే సౌండ్ నాకు చాలా ఇరిటేషన్" అన్నాడు. 'ఆ బీట్ అంటే నాకు చాలా ఇష్టం' అని చరణ్ అన్నాడు. 'అయితే నేను చేసిన పాటల్లో ఏది నచ్చలేదో నువు చెప్పు' అన్నారు కీరవాణి. అందుకు చరణ్ స్పందిస్తూ .. "నచ్చకపోవడమంటూ ఏమీ లేదు .. నేను మీరు చేసిన హిట్ సినిమాలే ఎక్కువగా చూశాను.
సాధారణంగా నచ్చిన పాటలనే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాము .. నచ్చని పాటలు గుర్తుండవు. ఈ మధ్య కాలంలో మీరు చేసిన ఒక సినిమాలోని ఓ పాట నాకు నచ్చలేదు. కాకపోతే ఆ సినిమా పేరు .. ఆ పాట ఏమిటనేది నాకు గుర్తుకు లేదు" అని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ తనకి నచ్చలేదని చెప్పిన 'భీమవరం బుల్లోడా' సాంగ్, నాగార్జున - ఆమని కాంబినేషన్లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'ఘరానా బుల్లోడు' సినిమాలోనిది. అప్పట్లో ఆ పాట మాస్ హిట్. కాకపోతే ఎన్టీఆర్ కి సాహిత్యంలోని కొన్ని పదాలు .. కొన్ని మూమెంట్స్ అభ్యంతరకరంగా అనిపించాయేమో!