Begin typing your search above and press return to search.

షేక్ చేస్తోన్న ఈషారెబ్బా లిప్ లాక్ రొమాన్స్!

By:  Tupaki Desk   |   18 Feb 2022 10:30 AM GMT
షేక్ చేస్తోన్న ఈషారెబ్బా లిప్ లాక్ రొమాన్స్!
X
ఇటీవ‌లి కాలంలో వ‌రంగ‌ల్ బ్యూటీ ఈషారెబ్బాలో చాలా మార్పులు గ‌మ‌నించ వ‌చ్చు. కెరీర్ ఆరంభం నుంచి ఒకానొక ద‌శ‌కు చేరుకునే వ‌ర‌కూ మ‌డి క‌ట్టుకుని కుర్చున్న బ్యూటీ ఇప్పుడు వాట‌న్నింటిని స‌వ‌రించిన‌ట్లే క‌నిపిస్తోంది. ఏడాదిన్న‌ర‌గా ఈషా ఫోటో షూట్ల‌లో అనూహ్య‌మైన మార్పులు. త‌న‌లో బోల్డ్ యాంగిల్ ని ప‌రిచ‌యం చేస్తూ కొన్ని ఫోటో షూట్లల‌లో పాల్గొంటుంది.

ఆనాడే ఈషా బ్యూటీ హ‌ద్దులు చెరిపేస్తుందంటూ కామెంట్లు ప‌డ్డాయి. తాజాగా అది నిజ‌మేన‌ని తేలిపోయింది. ప్ర‌స్తుతం ఈషా రెబ్బా మ‌ల‌యాళం హీరో కంచుకోబోబ‌న్ స‌ర‌స‌న `ఒట్టు` అనే సినిమాలో న‌టిస్తోంది. తాజాగా ఈసినిమా వీడియో సాంగ్ రిలీజ్ అయింది.

ఇందులో రొమాంటిక్ విర‌హ‌గీతంలో సంద‌ర్భానుసారం ఈషా హీరోతో ఇంటిమేట్ స‌న్నివేశాల్లో చెల‌రేగింది. కంచుకోబోబ‌న్ తో ఈషారెబ్బా లిప్ లాక్ స‌న్నివేశాలు..బెడ్ రూమ్ సీన్ పాట‌లో హైలైట్ అవుతున్నాయి.

రొమాంటిక్ స‌న్నివేశాల్లో టాలీవుడ్ బ్యూటీ ఓ రేంజ్ లో ఎలివేష‌న్స్ ఇచ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. నిన్న మొన్న‌టివ‌ర‌కూ మ‌డి క‌ట్టుకుని కుర్చున్న బ్యూటీ ఒక్క‌సారిగా పెద‌వి ముద్దులు ఒలికించ‌డంతో షాక్ తినాల్సిన ప‌రిస్థితి. ఈ పాట యూ ట్యూబ్ లో సంచ‌ల‌న సృష్టించ‌డం ఖాయం. అయితే సినిమాలో స‌న్నివేశం డిమాండ్ చేయ‌డంతోనే ఈషా రెబ్బా ఈ రేంజ్ లో ఎలివేష‌న్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈషారెబ్బా తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. కానీ అవేది అమ్మ‌డికి హీరోయిన్ గా అంత గుర్తింపు తీసుకురాలేదు. తొలుత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప‌రిచ‌య‌మైంది. అటుపై చిన్నా చిత‌కా సినిమాల్లో హీరోయిన్ గా న‌టించింది. ఆ త‌ర్వాత స్టార్స్ సినిమాల్లో సెకెండ్ లీడ్స్ కి రీచ్ అయింది. అయినా ఈషా కెరీర్ టర్న్ తీసుకోలేదు.

దీంతో ఇత‌ర భాష‌ల‌పై దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతం కోలీవుడ్ స‌హా మాలీవుడ్ లో బిజీ అయ్యే ప్ర‌య‌త్నాల్లో ఉంది. అలా వ‌చ్చిన ఒట్టు అవ‌కాశాన్ని ఒడిసిప‌ట్టుకుని ప్ర‌తిభ‌ను చూపే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్పుడు ఒక్క లిప్ లాక్ సీన్ తో సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిపోతుంది.