Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ .. ప్రభాస్ .. మధ్యలో శర్వా
By: Tupaki Desk | 28 Feb 2022 8:32 AM GMTకొన్ని సినిమాలకు అన్నీ కరెక్ట్ గా కుదిరిపోతాయి. కానీ రిలీజ్ టైమ్ మాత్రం సెట్టవ్వదు. దాంతో వాటి ఫలితం తారుమారవుతుంటుంది. అందుకే కథ, కథనాలు ఎంత కొత్తగా వున్నామేకర్స్ మాత్రం రిలీజ్ కోసం పర్ఫెక్ట్ టైమింగ్ ని కోరుకుంటారు. అలా పర్ఫెక్ట్ టైమింగ్ కుదిరాకే ఆయా చిత్రాలని రిలీజ్ చేస్తుంటారు. అయితే ఓ సినిమాని మాత్రం మేకర్స్ అందుకు భిన్నంగా విడుదల చేస్తున్నారు. పరిస్థితుల కారణంగా మేకర్స్ కి మరో ఆప్షన్ లేకపోవడంతో విపత్కర పరిస్థితుల్లో తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అదే `ఆడవాళ్లు మీకు జోహార్లు`.
శర్వానంద్ హీరోగా నటించారు. గత కొంత కాలంగా విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నారు. కొత్త కథలని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఆయన సినిమాలంటే ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యూత్ కూడా ప్రత్యేక ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే గత కొంత కాలంగా కొత్త పంథాలో సినిమాలు చేస్తున్న శర్వాకు చేతు అనుభవాలే ఎదురవుతున్నాయి. `మహాను భావుడు` చిత్రం తరువాత శర్వా ఆ స్థాయి సక్సెస్ ని సొంతం ఏసుకుని చాలా ఏళ్లవుతోంది.
ఇమేజ్ కి దూరంగా శర్వా చేసిన కొత్త కథలు నిరాశని కలిగించాయి. ఆశించిన స్థాయిలో కెరీర్ కి ఉపయోగపడలేకపోయాయి. దీంతో ఆలోచనలో పడిన శర్వానంద్ ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మార్చి 4న ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కాబోఎతోంది. శర్వాకు ఈ మూవీ హిట్ చాలా అవసరం. క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించారు. ఇప్పటికే బయటికి వచ్చాన టాక్ ని బట్టి ఈ మూవీలో శర్వానంద్ సూపర్ గా నటించారట.
ఆయన క్యారెక్ట్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆదివారం విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది కూడా. సినిమా టాక్ బాగుంది. ట్రైలర్ మరింత బాగుంది. కానీ రిలీజ్ టిమింగ్ మాత్రం కరెక్ట్ గా లేదనే వాదన ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. `భీమ్లానాయక్` రిలీజ్ తరువాత థియేటర్లు చాలా వరకు ఫుల్ అయిపోయాయి. దీంతో శర్వా చిత్రానికి భారీ స్థాయిలో థియేటర్లు లభించని పరిస్థితి.
అంతే కాకుండా మార్చి 4న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మరో 7 డేస్ తరువాత ప్రభాస్ `రాధేశ్యామ్` రాబోతోంది. ఆ తరువాత `ఆడవాళ్లు మీకు జోహార్లు` కు మరిన్ని థియేటర్లు తక్కుతాయి. ఏది చేసినా ఈ 7 రోజులు మాత్రమే శర్వాకు మిగిలాయి. ఈ ఏడు రోజుల్లో లిమిటెడ్ థియేటర్లలో విడుదల కావడం నిజంగా శర్వా దురదృష్టమే అంటున్నారు. ఈ టైమ్ తప్పితే శర్వా వరుసగా భారీ చిత్రాలతో పోటీపడాల్సిన పరిస్థితి. దీంతో చేసేది లేక భీమ్లా కు రాధేశ్యామ్ కు మధ్యలో రిలీజ్ చేస్తుండటం తో అంతా గుడ్ మూవీ బట్ రాంగ్ టైమింగ్ అని వాపోతున్నారట.