Begin typing your search above and press return to search.
మైనస్ లో ఉన్నప్పుడే తప్పుల్ని ప్రశ్నిస్తారు?
By: Tupaki Desk | 10 March 2022 5:07 AM GMTతమిళ స్టార్ హీరో సూర్య సింగంలా దూసుకొచ్చేదెప్పుడు? తెలుగు అగ్ర హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉండీ అతడు ఇప్పుడు రేసులో వెనకబడిపోవడానికి కారణమేమిటీ? అంటూ విశ్లేషిస్తున్నారు. నిజానికి సూర్య డౌన్ ఫాల్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. ఇంతకుముందు సింగం సిరీస్ ని యముడు టైటిళ్లతో రిలీజ్ చేసి బంపర్ హిట్లు కొట్టాడు సూర్య. గజినితో గొప్ప ఫాలోయింగ్ తెచ్చుకుని తమళం - తెలుగులో పెద్ద స్టార్ అయ్యాక యముడు సిరీస్ తో మరో లెవల్ ఏంటో చూపించాడు. మాస్ లో గొప్ప ఫాలోయింగ్ ఉన్న స్టార్ అయ్యాడు. కానీ ఇటీవల ఏమైందో కానీ సూర్య బజ్ అమాంతం తగ్గిపోయింది. ముఖ్యంగా అతడు నటించిన వరుస చిత్రాలు హిట్టయినా కానీ ఇప్పుడు రిలీజ్ కి వస్తున్న ఈటీ చిత్రానికి అంత గా క్రేజ్ రాలేదు.
ముఖ్యంగా ఈ మూవీకి ఆన్ లైన్ బుకింగుల్లో అస్సలు క్రేజ్ కనిపించలేదు. బుకింగులు నిరాశపరిచేలా కనిపిస్తున్నాయి. అయితే దీనికి కారణమేమిటి? అంటూ ఆరాలు అంతే ఇదిగా ఉన్నాయి. అతడు నటించిన ఆకాశమే నీ హద్దురా చిత్రానికి అద్భుతమైన టాక్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన జై భీమ్ క్రిటిక్స్ ప్రశంసలతో పాటు ప్రేక్షకాదరణ పొందింది. కానీ దీనిని సూర్య ఎన్ క్యాష్ చేయలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ రెండు చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడమే సూర్యకు పెద్ద మైనస్ అయ్యిందన్న గుసగుసా వినిపిస్తోంది. సూర్యను ఇప్పుడు ఓటీటీ స్టార్ గానే ప్రజలు భావిస్తున్నారని ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది. జనం అలవాట పడిపోయిన ఫార్మాట్ లోనే సినిమాలు చూస్తారని కూడా గుసగుసగా చెబుతున్నారు. అయితే ఇది నిజమా? అంటే చెప్పలేం. ఇప్పుడు ఉన్నది రేపు ఉండదు. రేపు ఉన్నది ఆ తర్వాతా ఉండదు. ఒకే ఒక్క మాసివ్ హిట్ సాధించి సూర్య తిరిగి కంబ్యాక్ కావాల్సి ఉంటుంది.
అయితే రిలీజ్ ముందే బజ్ తేలేకపోతే కనుక దాని ప్రభావం ఓపెనింగులపై ఉంటుంది. బుకింగుల జోరు ఉండదు. తమిళంలో సూర్యకు ఫర్వాలేదు. కానీ తనకు కీలకమైన తెలుగు మార్కెట్ లో విఫలం కాకూడదు. తమిళ మార్కెట్ లో ET కోసం ముందస్తు బుకింగ్ లు ఆశ్చర్యకరంగా తక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్ లు దారుణంగా ఉన్నాయి. ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించే ఎత్తుగడ పారలేదనేది టాక్.
నిజానికి సూర్య గత రెండు చిత్రాల్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఆపి ఉంటే కథ వేరేగా ఉండేదని థియేట్రికల్ బిజినెస్ బావుండేదని కూడా ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది. ఎలాగైనా ET పూర్తిగా పేలవమైన బుకింగ్ లు సూర్య మార్కెట్ పతనం కనిపిస్తోందనేది ఈ విశ్లేషణ. అయితే అన్నిటికీ చెక్ పెట్టాలంటే సినిమా రిలీజై బంపర్ హిట్ టాక్ తెచ్చుకోవాలి. మంచి సమీక్షలు ఇంపార్టెంట్. కానీ దానికోసం ప్రచారం అంతే అవసరం.
ఈ విభాగంలో సూర్య టీమ్ మరింత మెరుగ్గా పని చేస్తుందేమో చూడాలి. ఈటీకి కూడా ఆకాశమే నీ హద్దురా తరహాలో పాజిటివ్ టాక్ తేగలగాలి. తర్వాత మౌత్ టాక్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ ఏం జరగనుందో వేచి చూడాలి. రాధేశ్యామ్ కంటే ఒక రోజు ముందు అంటే మార్చి 10న సూర్య ఈటీ విడుదలవుతున్న సంగతి తెలిసిందే.