Begin typing your search above and press return to search.
బన్నీ - జక్కన్న.. మధ్యలో బోయపాటి..!
By: Tupaki Desk | 17 March 2022 10:30 AM GMTదర్శకధీరుడు రాజమౌళి - స్టార్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు సన్నాహాలు మొదలయ్యాయని నిన్నటి నుంచి మీడియా - సోషల్ మీడియా కోడై కూస్తోంది. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించే కథతో వీరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది. కాకపోతే అది కార్యరూపం దాల్చడానికి సమయం పట్టే అవకాశం ఉంది.
'పుష్ప: ది రైజ్' మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ అందుకుని అమాంతం బన్నీ క్రేజ్ ను రెట్టింపు చేసింది. దీంతో ఇప్పుడు స్టైలిష్ స్టార్ తదుపరి ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇకపై అన్నీ పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా సినిమాలు చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప: ది రూల్' సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి బన్నీ సన్నద్ధం అవుతున్నారు. మొదటి భాగానికి మించి ఉండేలలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈలోపు తన తర్వాతి సినిమాలకు సంబంధించిన పనులపై ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్. పలువురు క్రేజీ దర్శకులతో సమావేశమవుతూ చర్చలు జరుపుతున్నారు.
ఇందులో భాగంగా రాజమౌళితో అగ్ర హీరో ఓ మూవీ సెట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ 2024 జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ గ్యాప్ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ ఓ మూవీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
'సరైనోడు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ - బోయపాటి కాంబినేషన్ లో మరో సినిమాకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'పుష్ప' పార్ట్-1 తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు 'పుష్ప 2' ని ముందుగా పూర్తి చేయాలని ప్లాన్ చేయడంతో.. బోయపాటి వెయిటింగ్ లిస్టులో ఉండాల్సి వచ్చింది.
కాకపోతే 'పుష్ప: ది రూల్' సినిమా తర్వాత బోయపాటి సినిమా కోసం డేట్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. 2023లో వీరి కాంబోలో మూవీ సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. అంటే రాజమౌళి సినిమా కంటే ముందు బోయపాటితో బన్నీ ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తారన్నమాట.
ఇకపోతే ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ భేటీ అవ్వడంతో వీరి కలయికలో ఓ ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ బీటౌన్ లో మొదలైంది. అలానే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో కూడా ఓ మూవీ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే బన్నీ లైనప్ పై క్లారిటీ రానుంది.