Begin typing your search above and press return to search.

అమీజాక్స‌న్ తో ప్రేమాయ‌ణం..హీరో జీవితం నాశ‌నం!

By:  Tupaki Desk   |   17 March 2022 12:30 AM GMT
అమీజాక్స‌న్ తో ప్రేమాయ‌ణం..హీరో జీవితం నాశ‌నం!
X
బాలీవుడ్ యంగ్ హీరో ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ సుప‌రిచితుడే. 'ఏక్ దివానా'తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్ర‌తీక్ ఉత్త‌రాదిన ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు. అయితే తొలి సినిమాతోనే యంగ్ హీరో బ్రిట‌న్ బ్యూటీ అమీజాక్స‌న్ తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఇద్ద‌రు కొన్నాళ్ల‌ పాటు బాగానే మూవ్ అయ్యారు. విదేశీ ప్ర‌యాణాలు.రొమాంటిక్ డేట్ ల‌తో జీవితాన్ని ఆస్వాదించారు. పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కానీ ఆప్రేమ మూడు నాళ్ల ముచ్చ‌ట‌గానే సాగింది. 2011లో ల‌వ్ చేసుకున్న జంట 2012లో విడిపోయారు.

ఆ త‌ర్వాత ఎవ‌రి జీవితం వారిది. అయితే తాజాగా అమీతో ప్రేమాయ‌ణం త‌న జీవితాన్నే నాశ‌నం చేసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు ప్ర‌తీక్. "అమీతో ప్రేమాయ‌ణం క‌లిసిరాలేదు. ఆమె నన్ను ఎంత‌గానే కృంగ‌దీసింది. తీవ్ర‌మైన మ‌న‌స్తాపానికి గుర‌య్యాను. మంచి సినిమాలో న‌టించాం. ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్ బాగుంద‌నుకున్నా. కానీ నా జీవితాన్నే మార్చేసింది. అమీతో ప్రేమతో గంద‌రోళం మొదలైంది. బ్రేకప్ త‌ర్వాత బ్యాడ్ టైమ్ మొద‌లైంది. 25 ఏళ్ల వ‌య‌సులోనే ప్రేమ బెడిసి కొట్టింది. ఇది నాతో పాటు అంద‌రికీ విచిత్రంగానే అనిపించింది.

నాప‌ని అయిపోయింద‌నుకున్నా. ఆ త‌ర్వాత చాలా ఫెయిల్యూర్స్ చూసాను. బ్రేక‌ప్ త‌ర్వాత ఇద్ద‌రం ట‌చ్ లో లేము. నా మాజీ ప్రేయ‌సితో ప్రెండ్లీగా ఉండ‌లేన‌ని కాదు. అసాధ్య‌మ‌ని కాదు. ఎందుకో ఇద్ద‌రం మాట్లాడుకోలేదు. దానికి కార‌ణాలైతే నాకు తెలియ‌దని ప్ర‌తీక్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. కానీ ప్రేమించి తొలిసారి మ‌న‌సిచ్చిన అమ్మాయి విష‌యంలో ఇంత ఘాటుగా స్పందించ‌డం ఆస‌క్తిక‌రం. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై అమీజాక్స‌న్ ఏదైనా రిప్లై ఇస్తుందేమో చూడాలి.

ప్రేమించ‌డం..తేడాలోస్తే విడిపోవ‌డం బాలీవుడ్ లో చాలా స‌హ‌జం. పెళ్లైన 20 ఏళ్ల బంధానికే సునాయాసంగా విడాకుల‌తో స్వ‌స్తి చెబుతున్నారు. ఆ త‌ర్వాత ఎవ‌రి జీవితా వారు చూసుకుంటున్నారు. అయినా స్నేహితులుగా అప్పుడ‌ప్పుడు క‌లుస్తుంటారు. క‌లిసి పార్టీలకు..ప‌బ్ ల‌కు వెళ్తుంటారు. ప్ర‌తీక్-అమీ జాక్స‌న్ మాత్రం అలాంటి వాళ్ల‌కు భిన్నంగా వెళ్తున్నారు. విడిపోయిన త‌ర్వాత ఒక‌రితో ఒక‌రు సంబంధం లేకుండా ఉన్నారు. స్నేహితులుగా క‌ల‌వాల‌నుకోవ‌డం లేదు. ప్రేమ వైఫ‌ల్యంతోనే అన్ని రాకాల బంధాల‌కు బైబై చెప్పేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కి అమీజాక్స‌న్ వేరొక‌ర్ని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిర‌ప‌డింది. ఆమెకు పిల్ల‌లు క‌ల‌రు. సినిమా ల‌కు గుడ్ బై చెప్పేసింది. ఇక ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ బాలీవుడ్ లో బిజీ న‌టుడిగా ఎదుగుతున్నాడు. గతేడాది ఏకంగా మూడు చిత్రాల్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు. ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు.

'ఇండియా లాక్ డౌన్'..'బ‌చ్చ‌న్ పాండే' చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అమీజాక‌న్స‌న్ శంక‌ర్ తెర‌కెక్కించిన '2.0' తో ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న 'ఎవ‌డు' చిత్రంలో న‌టించింది.