Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కి దేవ‌ర‌కొండ బర్త్ డే ట్రీట్ ఇదే!

By:  Tupaki Desk   |   15 March 2022 7:35 AM GMT
ఫ్యాన్స్ కి దేవ‌ర‌కొండ బర్త్ డే ట్రీట్ ఇదే!
X
యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే అవ‌కాశాల‌ ప‌రంగా యంగ్ హీరో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరో ఇమేజ్ కావొచ్చు..ఆనంద్ దేవ‌ర‌కొండ క్రేజ్ కావ‌చ్చు. కార‌ణం ఏదైనా ఆనంద్ ఇంట ఆనంద‌మే ఆనందం. ప్ర‌స్తుతం ఆనంద్ చేతిలో మూడు నాలుగు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. 'హైవే' ..'బేబి'..'గ‌మ్ గ‌మ్ గ‌ణేశా' చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఇలా ఆనంద్ కెరీర్ సంతోషంగా సాగిపోతుంది. తాజాగా యంగ్ హీరో పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న చిత్రాల యూనిట్ స‌భ్యులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ని రిలీజ్ చేస్తున్నారు.

'బేబి' యూనిట్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో ఆనంద్ లుక్ రొటీన్ కి భిన్నంగా ఉంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఆనంద్ మాడిపోతున్న రోజు పువ్వును చూస్తూ ఏదో కోల్పోతున్న వైనాన్ని హైలైట్ చేసారు. రోజా ప్రేమ‌కి సంకేతం. కాబ‌ట్టి ఆనంద్ ల‌వ్ లో ఫెయిలైన సంద‌ర్భాన్ని అక్క‌డ ఫోక‌స్ చేస్తున్న‌ట్లు కనిపిస్తుంది. మ‌రి వాడిపోతున్న ఆ రోజా వెనుక క‌థేంటి? అన్న‌ది తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కూ ఆగాల్సిందే. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న 'బేబీ' మూవీ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.

ఈ చిత్రానికి సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్- దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అలాగే ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న మ‌రో చిత్రం 'హేవే' నుంచి కూడా పుట్టిన రోజు సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. హిల్ స్టేషన్ లో టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందీ పోస్టర్. కొండ రాయిపై కూర్చుని చుట్టూ అందమైన నేచర్ ని ఆస్వాదిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. యూత్ అట్రాక్ష‌న్ లుక్ లో హైలైట్ అవుతున్నాడు. ఈ పోస్టర్ ద్వారా ఆనంద్ కు బర్త్ డే విశెస్ చెప్పింది చిత్ర యూనిట్.

కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ కు 'హైవే'మరొక కొత్త తరహా సినిమా కానుందని యూనిట్ ధీమా వ్య‌క్తం చేసింది. చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్తిచేసి త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. హైవే సైకో థ్రిల్ల‌ర్ నేప‌థ్యమున్న స్టోరీ. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ఆనంద్ కి జోడీగ‌తా మానస రాధాకృష్ణన్‌ న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఆనంద్ బ‌ర్త్ డేని కుటుంబ స‌భ్యులు నిరాడంబ‌రంగా జ‌రుపుకున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌..త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలో ఆనంద్ కేక్ క‌ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. విజ‌య్ ఈ ఫోటోల్లో క్యాజువ‌ల్ దుస్తుల్లో క‌నిపిస్తున్నాడు. ఫ్యామిలీ అంతా క‌లిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

'బేబి' టెక్నిక‌ల్ టీమ్: సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి-సంగీతం: విజయ్ బుల్గానిన్- ఎడిటింగ్: ఎం.ఆర్ వర్మ ఆర్ట్: సురేష్- సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్-చీఫ్ సహాయ దర్శకుడు: మహేష్ అలంశెట్టి-కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.

'హైవే' న‌టీన‌టులు-సాంకేతిక నిపుణులు: ఈ సినిమాలో అభిషేక్ బెనర్జీ.. సయామీ ఖేర్.. సత్య.. జాన్ విజయ్ తదితరులు న‌టిస్తున్నారు. కథ- స్క్రీన్‌ ప్లే- సినిమాటోగ్రఫి- దర్శకత్వం: కె వి గుహన్ సంగీతం: సైమన్‌ కె. కింగ్‌.