Begin typing your search above and press return to search.
ఆడజాతి పరువు తీసిన అనసూయ!
By: Tupaki Desk | 4 April 2022 11:37 AM GMTయాంకర్ కమ్ నటి అనసూయ ధరించే పొట్టి దుస్తులపై వచ్చే కామెంట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా వేదికగా అనసూయ చాలాసార్లు నెటి జనులకి టార్గెట్ అయింది. వాటికి అంతే ధీటుగాను అనసూయ బధులిచ్చిన సందర్భాలున్నాయి. ఒకానొక సందర్భంలో తోటి యాంకర్ల సైతం అనసూయ పొట్టి బట్టల గురించి లైవ్ లోనే మాట్లాడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అనసూయ షో మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది.
ఆ రేంజ్ లో అనసూయ కాస్ట్యూమ్స్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. తాజాగా ఓ నెటిజనుడు ట్విటర్ వేదికగా అనసూయని ఉద్దేశించి సంచలన కామెంట్లు చేసాడు. "అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి బట్టలు వేసుకుంటావా? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు?" అంటూ బాధతో కూడిన ఎమోజీనీ...కన్నీళ్లు కార్చుతోన్నమరో ఎమోజీని పోస్ట్ చేసాడు.
దీంతో అనసూయ కూడా అదే రేంజ్ లో బధులిచ్చింది. "దయచేసి మీరు మీ పని చూసుకోండి. నన్ను నా పని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు" అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించిన ఎమోజీనీ...సీరియస్ గా చూస్తోన్న మరో ఎమోజీని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ విషయంలో అనసూయని సపోర్ట్ చేసేది కొంతమందైతే..వ్యతిరేకించే వర్గం ఇంకొకటి ఉంది.
అయితే ఆ నెటి జనుడికి మద్దతుగానే ఎక్కువ కామెంట్లు పడుతున్నాయి. అనసూయ బట్టల గురించి ఇలాంటి డిస్కషన్ జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు ఆమె బట్టలపై వాడి వేడిగా చర్చ సాగింది. అనసూయ ప్రతీసారి టార్గెట్ అయ్యేది కేవలం కాస్ట్యూమ్స్ దగ్గరే. నెటి జనులకి-అనసూయకి ఆ విషయంలో ఎందుకనో సింక్ తొలి నుంచి కుదడం లేదు. అలాగని అనసూయ వాటిని సీరియస్ గా తీసుకున్నది లేదు.
ఎవరి నోటికొచ్చినంత వారు వాగుకున్నంత అని వదిలేసింది. మళ్లీ కొంత గ్యాప్ అనంతరం ఇలా రచ్చ మొదలైంది. రెండు..మూడు రోజుల ఈ రచ్చ సాగుతుంది. మరోవైపు రేవ్ పార్టీ పబ్ వ్యవహారానికి తోడుగా అనసూయ టాపిక్ నెట్టింట వైరల్ గా మారడం విశేషం.
ఇక అనసూయ యాంకర్ గా నటిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుల్లి తెర షోలతో ఏ యాంకర్ లేనంత బిజీగా ఉంది. అగ్ర హీరోల సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది.