Begin typing your search above and press return to search.

భీమ్లాలో ఆ బూతు పదాన్ని తొలగించారట..!

By:  Tupaki Desk   |   23 Feb 2022 4:38 AM GMT
భీమ్లాలో ఆ బూతు పదాన్ని తొలగించారట..!
X
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్ లలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్ పొందింది. అయితే దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

'భీమ్లా నాయక్' సినిమా ఫైనల్ కాపీ చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు.. ఇందులో ఒక్క కట్‌ ని మాత్రమే సూచించారట. తెలుగులో అభ్యంతరకరమైన ‘లంబ్డీ’ అనే పదాన్ని తొలగించాలని కోరారట. సాధారణంగా ఈ పదాన్ని ఎవరినైనా తిట్టడానికి ఉపయోగించే పదాలకు జోడిస్తుంటారు. అందుకే దాన్ని సెన్సార్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే సినిమాలో ఈ పదం పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిందా లేక మరెవరితోనైనా చెప్పించారా అనేది ప్రస్తుతానికి తెలియదు. కాకపోతే టీజర్ - ట్రైలర్ లో మాత్రం 'రారా నా కొ*కా' అంటూ కొన్ని పదాలను పవన్ తో పలికించిన సంగతి తెలిసిందే.

నిజానికి ఓటీటీలలో వచ్చే వెబ్ కంటెంట్ లో బూతులు వినిపించడం సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలో వెండి తెర మీదకొచ్చే కొన్ని సినిమాలలోనూ అసభ్యకరమైన పదాలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే సెన్సార్ బోర్డ్ వాటికి కత్తెర వేస్తూ.. మ్యూట్ చేస్తూ అడ్డుకట్ట వేస్తోంది.

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలో కూడా సెన్సార్ బోర్డు ఇదే తరహా కట్‌ ను సూచించింది. బాలయ్య చెప్పిన ఓ డైలాగ్‌ లో ‘లంబిడి’ అనే పదాన్ని తొలగించమని మేకర్స్‌ ని కోరారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా నుంచి అదే పదాన్ని తీసేయమని సూచించారట.

కాగా, 'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. థమన్ సంగీతం సమకూర్చగా.. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేశారు.