Begin typing your search above and press return to search.
బిబి ఓటీటీ : నాగార్జున కూడా అంతకు మించేనట!
By: Tupaki Desk | 1 March 2022 3:38 AM GMTరెగ్యులర్ బిగ్ బాస్ తో పోల్చితే ఓటీటీ బిగ్ బాస్ లో మసాలా ఎలిమెంట్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఇప్పటికే హిందీ లో వచ్చిన బిబి ఓటీటీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. తెలుగు లో కూడా ఆ స్థాయి ఎంటర్ టైన్మెంట్ తో పాటు వివాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రెగ్యులర్ బిగ్ బాస్ కు మించి ఉంటుంది అంటూ షో నిర్వాహకులు బలంగా ప్రచారం చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ సమయంలోనే నాగార్జున కొత్త సీజన్ గురించి ప్రకటించాడు. ఓటీటీ బిగ్ బాస్ తెలుగు లో అనగానే చాలా మంది నాగార్జున కాకుండా మరెవ్వరైనా హోస్టింగ్ చేస్తారని అంతా భావించారు. ఓటీటీ బిగ్ బాస్ అంటే కాస్త అంచనాలు మరియు ఆసక్తి తక్కువగా ఉంటుంది. కనుక నాగార్జున స్థాయి స్టార్ అక్కర్లేదేమో అని కొందరు విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు మరియు షో నిర్వాహకులు భారీ పారితోషికం ఇచ్చి మరీ నాగార్జునను హోస్ట్ గా తీసుకున్నారు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం గత బిగ్ బాస్ సీజన్ లకు మూడు సార్లు నాగార్జున హోస్టింగ్ చేశాడు. కానీ ఈసారి అత్యధికంగా పారితోషికం ను నాగార్జున తీసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. గత సీజన్ లతో పోల్చితే పారితోషికం భారీగా నాగ్ పెంచాడని అంటున్నారు.
నాగార్జున మొత్తం సీజన్ కు కలిపి దాదాపుగా రూ. 8.5 కోట్ల ను పారితోషికంగా అందుకుంటాడని సమాచారం అందుతోంది. ఇంతకు ముందు వారాల వారిగా పారితోషికం ఉండేది. కాని ఈసారి మాత్రం బల్క్ అమౌంట్ ను పారితోషికంగా నాగ్ మాస్టారు తీసుకుంటున్నాడని సమాచారం అందుతోంది. ఒక సినిమా పారితోషికం స్థాయిలో నాగార్జున బిగ్ బాస్ కు గాను పారితోషికం తీసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
బిగ్ బాస్ ఓటీటీ లో మసాలా ఎలిమెంట్స్ అంతకు మించి అన్నట్లుగా ఉంటాయని.. నాగార్జున పారితోషికం కూడా అంతకు మించి ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. నాగార్జున స్థాయి స్టార్ అయితేనే ఈ షో కు బెటర్ అని గత మూడు సీజన్ ల రేటింగ్ తో తేలిపోయింది. నాగార్జున మాత్రమే బిగ్ బాస్ కు సూపర్ పర్ఫెక్ట్ అనే విషయాన్ని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయనకు ఆ స్థాయి పారితోషికం.
నాగార్జున హీరోగా తాజాగా బంగార్రాజు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగ చైతన్య కూడా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఘన విజయం సొంతం చేసుకున్న బంగార్రాజు సినిమా ప్రస్తుతం ఓటీటీ లో కూడా ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగార్జున హోస్ట్ అనే సినిమాను చేస్తున్నాడు. ప్రవీన్ సత్తార్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. నాగార్జున వెబ్ సిరీస్ కు కూడా ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.