Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఓటీటీలో లో పాత ముఖాలేనా?

By:  Tupaki Desk   |   25 Feb 2022 11:33 AM GMT
బిగ్ బాస్ ఓటీటీలో లో పాత ముఖాలేనా?
X
తెలుగులో బిగ్ బాస్ ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. శ‌ని..ఆదివారాలు వ‌స్తే బిగ్ ఫ్యాన్స్ లైవ్ షోల‌కు అతుక్క‌పోయేవారు. మాటీవీ టీఆర్పీని పెంచిన షోగా బిగ్ పెద్ద స‌క్సెస్ అయింది. అయితే ఇక‌పై శ‌నివారం..ఆదివారం వ‌ర‌కూ ఎదురు చూడాల్సిన ప‌నిలేదు. 24 గంట‌లు బిగ్ బాస్ చూసుకునే వెసులుబాటు దొరికింది. ఈనెల 26 నుంచి బిగ్ బాస్ ఓటీటీ షో ప్రారంభం కాబోతున్న‌ట్లు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో లైవ్ కానుంది. `నోకామా..నో పుల్స్టాప్..ఇక‌పై నాన్ స్టాప్ ఎంట‌ర్ టైన్ మెంట్` అనేది బిగ్ బాస్ ఓటీటీ ట్యాగ్ లైన్ గా మారిపోయింది.

ఈ ఓటీటీ షోకి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తారు. త్వ‌ర‌లోనే షో ప్రారంభం కానుంది. దీంతో ఓటీటీ కంటెస్టెంట్లు? ఎవ‌రు అన్న ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంంది. గ‌త బిగ్ బాస్ సీజ‌న్లో పాల్గొన్నవారు- సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన వాళ్ల‌ని ఓటీటీ కంటెంస్టెంట్లుగా ఎంపిక చేస్తున్న‌ట్లు స‌మాచారం. తాజాగా ఓటీటీ షో తెలుగు శ‌నివారం నుంచి ప్ర‌సారం కానుంది. దానికి సంబంధించిన‌ ఒక ప్రోమోని రిలీజ్ చేసారు. ఇందులో బిగ్ బాస్ కొత్త ఇంటిని నాగార్జున ప‌రిచ‌యం చేసారు.

ఇప్ప‌టివ‌ర‌కూ బిగ్ బాస్ గంట మాత్ర‌మే చూసేవారు. ఇక‌పై గ్యాప్ లేకుండా చూసేయండ‌ని నాగ్ ప్రోమోలో తెలిపారు. శ‌నివార సాయంత్రం ఆరు గంట‌ల నుంచి స్ర్టీమింగ్ కానుంది. సెట్ డిజైన్ కూడా బాగుంది. రెగ్యుల‌ర్ సెట్ డిజైన్ కాన్న ఇంకాస్త హ‌డావుడి ఓటీటీ సెట్ లో క‌నిపిస్తోంది. కంటెస్టెంట్ల‌ను ఇప్ప‌టికే ఎంపిక చేసి క్వారంటైన్ లో ఉంచిన‌ట్లు స‌మాచారం. యాంక‌ర్ స‌వ్రంతి.. బిందుమాధ‌వి.. యాంక‌ర్ శివ కొత్త వాళ్ల‌గా.. ధ‌న్ రాజ్..ముమైత్ ఖాన్.. త‌నీష్..ఆద‌ర్శ్..మ‌హేష్ విట్టా.. అషు రెడ్డి.. అరియానా.. అకిల్ సార్ద‌క్..స‌ర‌యూ..హ‌మీదా..న‌ట‌రాజ్ మాస్ట‌ర్ఉ త‌దిత‌ర మాజీలు ఉన్న‌ట్లు స‌మాచారం.

అయితే ఇలా మాజీల్ని మ‌ళ్లీ ఎంపిక చేయ‌డం నిజ‌మైతే `బిగ్ బాస్` ఓటీటీ ఫ్రెష్ ఫీల్ ని తీసుకురావ‌డం క‌ష్ట‌మ‌నే టాక్ ఉంది. కొత్త వాళ్ల‌కి అవ‌కాశం ఇస్తే ప్రేక్ష‌కుల‌కు కొత్త ముఖాల్ని ప‌రిచయం చేసిన‌ట్లు ఉంటుంది. షోకి ప్రెష్ లుక్ వ‌స్తుంది. ఔత్సాహికుల్ని ప్రోత్స‌హించిన‌ట్లు ఉంటుంద‌న్నది కొంద‌రి అభిప్రాయంగా చెబుతున్నారు.

అయితే నిర్వాహ‌కులు కేవ‌లం ప్ర‌ధానంగా శ‌ని..ఆదివారాలు సాగ్ బిగ్ బాస్ టీవీ షో పైనే ఎక్కువ ఫోక‌స్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో ప్ర‌తీ సీజ‌న్ కి కేవ‌లం కొత్త వారినే ఎంపిక చేస్తారు. పాత వాళ్లు ఎవ‌రైనా అతిధులుగా వ‌చ్చి వెళ్లిపోవ‌డ‌మే . ఓటీటీ బిగ్ బాస్ అనేది కేవ‌లం ప్ర‌త్యా మ్నాయంగా..ఓటీటీ వృద్దిలోకి వ‌స్తోన్న నేప‌థ్యంలో చేస్తోన్న షో త‌ప్ప అందులో సీరియ‌స్ నెస్ క‌నిపించ‌లేదు అన్న‌ది కొంద‌రి వాద‌న‌. అందుకే షో శ‌నివారం నుంచి ప్ర‌సారం అవుతున్న ఓటీటీ గేమ్ పై పెద్ద‌గా ఆస‌క్తి క‌నిపిండ‌చం లేద‌న్న‌ది కొందరి వాద‌న‌.