Begin typing your search above and press return to search.
డైలాగ్ కింగ్ రూటే వేరు!
By: Tupaki Desk | 19 March 2022 4:35 AM GMTమోహన్ బాబు .. వెండితెరపై విలక్షణమైన పాత్రలకి కేరాఫ్ అడ్రెస్. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం .. గంభీరమైన వాయిస్ .. తీక్షణమైన చూపులు .. ఆయనలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలోని 'మోదుగుల పాలెం' గ్రామంలో పుట్టిపెరిగిన మోహన బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. మద్రాసులో ఒక వైపున చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ .. సినిమాల పట్ల గల ఆసక్తితో ఆ దిశగా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. అలా 'అల్లూరి సీతారామరాజు సినిమాలో ఒక చిన్న వేషం వేసిన ఆయన, ఆ తరువాత దాసరి నారాయణరావు దగ్గర మంచి మార్కులు కొట్టేశారు.
మంచు భక్తవత్సలం నాయుడు పేరును 'స్వర్గం నరకం' సినిమాతో మోహన్ బాబుగా మార్చింది దాసరినే. అప్పటి నుంచి ఆయన ఆ పేరుతోనే విజయాలను అందుకుంటూ కెరియర్లో దూసుకుపోయారు. ఒక వైపున ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తమ జోరును కొనసాగిస్తూ ఉండగా, మరో వైపున కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు తమదైన ఒక డిఫరెంట్ స్టైల్ తో చెలరేగిపోతుండగా మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. విలన్ గా .. కామెడీ టచ్ ఉన్న విలన్ గా ఆయన తనదైన డైలాగ్ డెలివరీతో .. బాడీ లాంగ్వేజ్ తో ఒక ప్రత్యేకమైన మార్గంలో ముందుకు వెళ్లారు.
అలా తనకంటూ ఆయన ఒక క్రేజ్ ను తెచ్చుకున్న తరువాత సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, హీరోగా ప్రేక్షకుల ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచన చేశారు. అప్పటివరకూ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న మోహన్ బాబు .. అప్పటి వరకూ సంపాదించిన డబ్బుతో రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు. హీరోగా ఫెయిల్ అయితే మళ్లీ వెనక్కి వెళ్లి చిన్న పాత్రలు చేసుకోవలసి వస్తుందని తెలిసినా ధైర్యంగా ముందుకు వెళ్లారు. అలా ఆయన చేసిన 'అల్లుడు గారు' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి ఆయన హీరోగాను .. నిర్మాతగాను వెనుదిరిగి చూసుకోలేదు.
ఇక ఆ తరువాత 'అసెంబ్లీ రౌడీ' .. 'రౌడీగారి పెళ్లాం' .. 'బ్రహ్మ' .. 'పెదరాయుడు' ఇలా వరుసగా సంచలన విజయాలను అందిస్తూ వెళ్లారు. ఒక వైపున మాస్ ఆడియన్స్ ను .. మరో వైపున ఫ్యామిలీ ఆడియన్స్ ను ఏకకాలంలో మెప్పించడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది. అదేదో సినిమాలో మోహన్ బాబు చెప్పిన డైలాగ్ మాదిరిగానే 'నా రూటే వేరు' అనిపించుకున్నారు .. డైలాగ్ కింగ్ గా ప్రశంసలు అందుకున్నారు. ఎన్టీ రామారావుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనతో 'మేజర్ చంద్రకాంత్' సినిమాను నిర్మించి, ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టిన ఘనతను కూడా మోహన్ బాబు సొంతం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయాలలోను కొంతకాలం పాటు చురుకైన పాత్రను పోషించారు. 'శ్రీవిద్యానికేతన్' పేరుతో విద్యా సంస్థలు స్థాపించారు.
500లకి పైగా సినిమాలలో నటించిన మోహన బాబు .. 50కి పైగా సినిమాలను నిర్మించారు. తన ప్రతిభకు కొలమానంగా ఆయన 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తరువాత ఆయన హీరోగాను .. కేరక్టర్ ఆర్టిస్ట్ గాను అడపా దడపా మాత్రమే తెరపై కనిపిస్తున్నారు. 'మహానటి' .. 'ఆకాశం నీ హద్దురా' వంటి సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఆయన సినిమాల సంఖ్యను చాలావరకూ తగ్గించుకున్నారు. కానీ ఆయన వరుస సినిమాలు చేయాలని .. తెరపై ఆయన నట వైభవాన్ని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మోహన్ బాబుతో ఒక పాత్రను చేయించాలంటే ఆ పాత్రకి ఒక ప్రత్యేకత ఉండాలి. ఆయన క్రేజ్ కీ .. హుందాతనానికి తగిన పాత్ర అయ్యుండాలి. ఆయన వలన ఆ పాత్రకి ఒక నిండుదనం .. పండుగదనం రావాలి. అలాంటి పవర్ ఫుల్ పాత్రలు వస్తే చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని మోహన్ బాబు అంటున్నారు. ఆయన స్థాయికి తగిన పాత్రలు పడకపోవడమే ఆయన తెరపై ఎక్కువగా కనిపించకపోవడానికి కారణం. అలాంటి పాత్రలు డిజైన్ చేయగలిగితే మోహన్ బాబును మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రల్లో మరి కొంతకాలం చూడొచ్చు. ఈ రోజున ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం