Begin typing your search above and press return to search.

బాబాయి తర్వాత అబ్బాయితో సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   31 March 2022 1:30 AM GMT
బాబాయి తర్వాత అబ్బాయితో సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌
X
కెరీర్‌ ఆరంభం నుండి ఇప్పటి వరకు వరుస సక్సెస్‌ లను దక్కించుకుంటూ వచ్చిన అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా తో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు దక్కించుకున్న అనీల్ రావిపూడి ఎఫ్ 3 తర్వాత చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. బాలకృష్ణ తో అనీల్‌ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా రూపొందుతుంది.

బాలయ్య.. గోపీచంద్ ల కాంబో మూవీ షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది మరో వైపు ఎఫ్ 3 సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. దాంతో బాలయ్య తో అనీల్‌ రావిపూడి సినిమా ఈ సమ్మర్ చివర్లో లేదా జులై లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య తో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ ను అనీల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. బాలయ్య సినిమా తర్వాత అనీల్ రావిపూడి చేయబోతున్న సినిమా కూడా కన్ఫర్మ్‌ అయ్యింది.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తో అనీల్ రావిపూడి సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. దిల్‌ రాజు వీరిద్దరి కాంబోలో సినిమాను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎఫ్‌ 3 సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఎఫ్ 3 షూటింగ్‌ సమయంలో తన వద్ద ఉన్న ఒక కథను దిల్‌ రాజుకు అనీల్‌ రావిపూడి వినిపించడం.. ఆ కథ ఎన్టీఆర్‌ కు బాగుంటుందని దిల్‌ రాజు భావించడం జరిగిందట.

దిల్ రాజు ఇటీవలే ఎన్టీఆర్‌ మరియు అనీల్‌ రావిపూడిల మద్య మీటింగ్‌ కు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అదుర్స్ వంటి ఒక పక్కా కమర్షియల్‌ ఎంటర్ టైనర్‌ స్క్రిప్ట్ ను ఎన్టీఆర్ కోసం అనీల్‌ రావిపూడి సిద్దం చేశాడు అంటూ సమాచారం అందుతోంది. కామెడీ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపించే ఎన్టీఆర్ ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్‌ చేస్తున్న యాక్షన్ సినిమాల నుండి కాస్త రిలీఫ్‌ కోసం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.

ఇటీవలే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జూన్ లో సినిమాను పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. కొరటాల శివ దర్శకత్వంలోనే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు దర్శకులకు కూడా ఎన్టీఆర్‌ ఓకే చెప్పాడు.

ఇప్పుడు అనీల్‌ రావిపూడికి కూడా ఎన్టీఆర్‌ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏది ముందు ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అనీల్ రావిపూడి మూడు నాలుగు నెలల్లో నే సినిమాను పూర్తి చేస్తాడు. కనుక ఆయనకే ఛాన్స్ ఇస్తాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇండస్ట్రీ లో అనీల్ రావిపూడి త్వరలో చేయబోతున్న బాబాయి మూవీ తర్వాత వెంటనే అబ్బాయి తో మూవీ ఉంటుందని అంటున్నారు.