Begin typing your search above and press return to search.
హరీష్ భాయ్ .. ఏదో జరుగుతోంది సుమీ!
By: Tupaki Desk | 13 April 2022 4:17 AM GMTసల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్' చిత్రాన్ని తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు హరీష్ శంకర్. ఆ రకంగా అతడు సల్మాన్ తో అనుబంధాన్ని కలిగి ఉన్నాడనే చెప్పాలి. చాలా గ్యాప్ తర్వాత సల్మాన్ భాయ్ ని కలుసుకునే అవకాశం హరీష్ కి దక్కింది. టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కలిశాడు. దబాంగ్ నటుడిని కలిసినప్పటి నుండి మబ్బుల్లో తేలేంత ఆనందంగా కనిపిస్తున్నాడు. హరీష్ తన ఇన్ స్టాగ్రామ్ లో సల్మాన్ ఖాన్ తో దిగిన ఫోటోని షేర్ చేశాడు. దానికి వ్యాఖ్యను కూడా జోడించాడు. ''మంత్రముగ్ధులను చేసే లైట్నింగ్ లాంటి సల్మాన్ ని చూశాను. చాలా ఆనందంగా గడిపాను.. భాయ్ నాకు లైఫ్ టైమ్ మెమరీని అందించినందుకు చాలా ధన్యవాదాలు.. అని ఆనందంలో తడిసి ముద్దయ్యాడు.
దబాంగ్ ని విజయవంతంగా తెలుగనువాదం చేసి తెరకెక్కించిన ఘనుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ గ్రాండ్ సక్సెస్ తర్వాత హరీష్ పేరు మార్మోగింది. ఆ సినిమా హరీష్ ని ఫ్లాపుల నుంచి కూడా గట్టెక్కించింది. ఆ తర్వాత బన్నీ- ఎన్టీఆర్- సాయి తేజ్ సహా పలువురు స్టార్లతో కలిసి పని చేసారు. ఇప్పుడు మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో భారీ సినిమా కోసం సన్నాహకాల్లో ఉన్నాడు. హరీష్ శంకర్ ప్రస్తుతం భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. పవన్ కల్యాణ్ ని ఈ చిత్రంలో సరికొత్తగా ఆవిష్కరించనున్నాడన్న టాక్ ఉంది. ఈలోగానే దబాంగ్ స్టార్ సల్మాన్ ఖాన్ ని కలుసుకునే అవకాశం దక్కింది. అయితే ఇది ఇంకేదైనా కొత్త సమీకరణానికి దారి తీస్తుందా? అన్నది ఆసక్తిని పెంచుతోంది. ఇక సల్మాన్ భాయ్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ లో కీలక అతిథి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.
భాయ్ మనసు వేరు..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' లో సల్మాన్ భాయ్ అతిథిగా కనిపించనున్నారు. దీనికోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా భాయ్ చిరుతో స్నేహం కారణంగా వద్దనుకున్నాడు. అంతేకాదు పారితోషికం ఇవ్వదలిస్తే తాను నటించనని కూడా అన్నాడు. సల్మాన్ ఖాన్ మూడ్ లో ఉన్నప్పుడు చాలా ఉదారంగా ఉంటాడు. అతడిని యారోన్ కా యార్ అని పిలుస్తారు.
సన్నిహితులు స్నేహితుల కోసం అతడు ఎంత దూరం అయినా వెళ్తాడు. సల్మాన్ తన యుక్తవయస్సు నుండి ఆరాధించే తెలుగు సూపర్ స్టార్ చిరంజీవితో శాశ్వతమైన బంధాన్ని కలిగి ఉన్నాడు. నిజానికి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తన బాలీవుడ్ అరంగేట్రం జంజీర్ కోసం ముంబైలో షూటింగ్ చేస్తున్నప్పుడు సల్మాన్ ప్రతిరోజూ రామ్ చరణ్ సెట్ కి వెళ్లి భోజనం చేసేవాడు. చిరు అంటే అంతటి అభిమానం భాయ్ కి. ఇకపోతే ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇస్తూ ఏకంగా పారితోషికాన్ని కూడా త్యజించారు భాయ్.
గాడ్ ఫాదర్ లో సల్మాన్ పోషించినది చాలా ప్రత్యేక అతిథి పాత్ర.. ఒరిజినల్ లో కంటే ఎక్కువగా పొడిగించిన అతిధి పాత్ర అని తెలిసింది. ఈ పాత్ర కోసం షూటింగ్ ప్రారంభించినప్పుడు సల్మాన్ తన పనికి ఒక్క పైసా కూడా తీసుకోలేనని స్పష్టంగా చెప్పాడు. ప్రాజెక్ట్ కి సంబంధించిన సోర్స్ ప్రకారం.. "చిరంజీవి నిర్మాతలు సల్మాన్ కి రూ. గాడ్‌ఫాదర్ లో నటిస్తున్నందున.. అతిథి పాత్రకు 15-20 కోట్లు ఇచ్చేందుకు ఓకే అయ్యారు.
కానీ సల్మాన్ మొండి.. చిరంజీవికి పారితోషికం ఇవ్వమని పట్టుపడితే తాను అతిధి పాత్రలో నటించనని చెప్పాడు. చిరంజీవిని ఉద్దేశించి సల్మాన్ ఏమని అడిగారంటే.. నా సినిమాలో ఒక పాత్ర చేయమని నేను మిమ్మల్ని అడిగితే దానికి మీరు వసూలు చేస్తారా? అంటూ హృదయాన్ని కదిలించే ప్రశ్న వేసారట. ఆ ప్రశ్నకు చిరంజీవి మూగబోయారట. గాడ్ ఫాదర్ లో సల్మాన్ పాత్రకు 20 నిమిషాల నిడివి ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు.