Begin typing your search above and press return to search.
'ఎఫ్ 3' సెట్స్ లో నాగరత్తమ్మత్త హల్ చల్
By: Tupaki Desk | 5 March 2022 6:29 AM GMTమూడేళ్ల క్రితం ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు `ఎఫ్ 2` చిత్రాన్ని నిర్మించారు. 2019 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ థీమ్‌తో బాక్సీఫీస్ ని కొల్లగొట్టింది. ఊహించని స్థాయిలో వంద కోట్ల మార్కుని అవలీలగా దాటి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ వంద కోట్లకు మించి రాబట్టడంతో ఈ మూవీకి సీక్వెల్ ని చేయాలని ముందే ఫిక్సయిపోయారు. దాదాపు మూడేళ్ల తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం `ఎఫ్ 3`.
`ఎఫ్ 2`ని ఫస్ట్ అండ్ ఫ్రస్ట్రేషన్ నేపథ్యంలో తెరక్కించిన అనిల్ రావిపూడి సీక్వెల్ ని డబ్బు దాని వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ ప్రధానాంశంగా రూపొదించారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. దిల్ రాజు, శిరీష్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం మే 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ కి మించి హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకుల్ని మరోసారి కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది.
రిలీజ్ దాదాపు మూడు నెలలు వుండటంతో చిత్ర బృందం అప్పుడే ప్రమోషన్స్ ని ప్రారంభించేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ లొకేషన్ వీడియోని విడుదల చేసింది. ఇందులో విశేషం ఏంటంటే `ఎఫ్ 2` డైహార్డ్ ఫ్యాన్ నాగరత్తమ్మ సెట్ లో చేసిన రచ్చ అంటూ సునయన తో ఓ వీడియోని రిలీజ్ చేశారు. `ఎఫ్ 3` పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గరికి వెళ్లి ప్రోగ్రెస్ కనుక్కోవడం.. అలాగే రిలాక్స్ మూడ్ లోకి వెళ్లి సరదాగా మాట్లాడుకుంటున్న హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ దగ్గరికి వెళ్లి వెంకీ ఆసన్ లాంటి కొత్త ఆసన్ మా లేడీస్ కోసం కూడా పెట్టొచ్చుగా అని సెటైర్ లు వేయడం.. అంతే కాకుండా మా అమ్మాయి వుంది పెళ్లి చేసుకుంటావా అని వరుణ్ తేజ్ ని ఆటపట్టించడం ఆకట్టుకుంటోంది.
తాజా వీడియోలో హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి సునయన నాగ రత్తమ్మగా చేసిన రచ్చ ఓ రేంజ్ లో నవ్వులు పూయిస్తోంది. మేకర్స్ ఈ ఆన్ ది సెట్స్ వీడియో విడుదల చేయడం వెనక వుద్దేశం .. `ఎఫ్ 3` మూవీ తొలి భాగానికి మించి మరింత హిలేరియస్ గా వుంటుందని స్పష్టం చేయడమేనని. ఆ విషయాన్ని స్పష్టం చేయడానికే నాగరత్తమ్మ పేరుతో వీడియోని విడుదల చేసిందని చెబుతున్నారు.
`ఎఫ్2`తో మిలేరియస్ ఎంటర్ టైనర్ ని అందించిన విక్టరీ వెంకటేష్ , వరున్ తేజ్ లతో మ్యాజిక్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి `ఎఫ్ 3`తో మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడా? .. అంతకు మించి ఆడియన్స్ ని తాజా సినిమాతో ఆకట్టుకుంటాడా? అన్నది తెలియాలంటే మే 27 వరకు వేచి చూడాల్సిందే.